Tuesday , May 21 2019
Home / National / జవాన్లని దారుణంగా అవమానించిన TRS V ప్రకాష్

జవాన్లని దారుణంగా అవమానించిన TRS V ప్రకాష్

పుల్వామా దాడిలో 44 మంది జవాన్లు చనిపోయిన తర్వాత అందరూ ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయారు.  దేశ వ్యాప్తంగా అందరూ ఇంకా ఆ బాధ నుండి తేరుకోలేక పోతున్నారు. దేశంలో దాదాపుగా ప్రతి గ్రామం నుండి కొవ్వత్తులతో ర్యాలీలు చేశారు, చేస్తున్నారు. జవాన్ ల కుటుంబాలకి ఆర్థిక సాయం చేస్తున్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు.

ఇలాంటి సమయంలో అపర మేధావులు, మోకాల్లో మెదడు పెట్టుకొని చిల్లర రాజకీయాలు చేస్తూ పోస్టులు చేయడం, లేదంటే టి‌వి డిబేట్ షోలో పబ్లిసిటీ కోసం దేశ ద్రోహ మాటలు మాట్లాడటం కొందరు చేస్తున్నారు. వీళ్ళకి దేశం కంటే వీళ్ళ పార్టీలు ముఖ్యమై పోయాయి. రోజు రోజుకి వీళ్ళ దిగజారుడు తనాలు ఎక్కువై పోతున్నాయి.

అయితే TRS పార్టీ V ప్రకాష్ ఒక లైవ్ డిబేట్ లో మన జవాన్లని అవమానిస్తూ మాట్లాడాడు. దేశం విషయంలో కూడా పార్టీ కోసం రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. పార్టీని పక్కన పెడితే ఇంతకు ముందు ఇతను తెలంగాణ ఉద్యమం పై పుస్తకం రాశాడు. ఇలాంటోడు ఇలాంటి దేశ ద్రోహ మాటలు మాట్లాడక అతనిపై సోషల్ మీడియాలో , యూట్యూబ్ లో చాలా మంది తీవ్రంగా స్పందిస్తున్నారు. పచ్చిగా చెప్పాలంటే బండ బూతులు తిడుతున్నారు. ఆ మాటలు ఒక్కొక్కటిగా వివరిస్తా. తప్పకుండా చదవండి.

 1. జవాన్లు అత్యాచారాలు, దాడులు చేస్తున్నారని, అందుకే ఉగ్రవాదులు పుట్టుకొస్తున్నారని అన్నాడు.
 2. చంపినోడు పాకిస్థాన్ వాడు కాదు. దాడి చేసిన వాడు పాకిస్థాన్ ఉగ్రవాది కాదు.
 3. సర్జికల్ స్ట్రైక్ గాని, సైనిక దాడి చేస్తే మళ్ళీ కాశ్మీర్ సమస్య పరిష్కారం కాదు.
 4. ఉగ్రవాదులుగా మారేలా కాశ్మీరీలు ప్రేరణ పొందడానికి కారణం జవాన్లు.
 5. మోడీ జవాన్ల చేతులకి powers ఇవ్వడం సరైంది కాదు, దీని వల్ల యుద్ధం వస్తుంది. యుద్ధం వస్తే మళ్ళీ బి‌జే‌పి అధికారంలోకి వస్తుంది.
 6. నెహ్రూ వల్ల ఇది ప్రారంభం అయింది.
 7. పుట్టినప్పుడు టెర్రరిస్టు గా వాళ్ళు పుట్టలేదు, పెరిగిన తర్వాత టెర్రరిస్టు కాలేదు, జవాన్లు గ్రామాల్లోకి వెళ్ళి అత్యాచారాలు చేసి, దాడులు చేసి టెర్రరిస్టు లని తయారు చేస్తున్నారు.
 8. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ని మెచ్చుకుంటా, ఎందుకంటే మోడీని చర్చలకి రమ్మంటే పోలేదు, మోడీని అభిమానించే వాళ్ళు కూడా ఉగ్రవాదులే.
 9. మళ్ళీ పాకిస్థాన్ ఉగ్రవాదులపై దాడులు చేయడమనేది జరిగితే, మోడీ ప్రధానిగా కావడానికే అవుతుంది.
 10. వాజ్ పేయి కార్గిల్ యుద్ధాన్ని వాడుకొని ప్రధాని అయ్యాడు అంటూ డిబేట్ లో మాట్లాడాడు.
 11. ఉగ్రవాద సంస్థలు ఏమి లేవు, .ఉగ్రవాదం లేదు, అందరూ ఇస్లాంలో ఉగ్రవాదం ఉంది అనే ముసుగు వేస్తున్నారు. ఇవన్నీ తలకాయలేని వాళ్ళు మాట్లాడుతున్నారు.
 12. అమెరికా ఆయిల్ వ్యాపారం కోసం, ఆయుధాల కోసం ఉగ్రవాదం ముసుగు వేస్తున్నారు.

కొంత మంది దేశభక్తిని మరిచి పార్టీల కోసం బ్రతుకుతున్నారు. ముందుగా అసలు కాశ్మీర్ లో బ్రతికిన కాశ్మీరీ పండిట్ ల పై ఎన్నో దాడులు చేసి, అత్యాచారాలు చేసింది అక్కడి పాకిస్థాన్ కి మద్దత్తు తెలుప్తున్న ముస్లింలు కాదా, కాశ్మీర్ నుండి లక్షల సంఖ్య లో హిందువులు మిగతా రాష్ట్రాల్లోకి భయంతో వెళ్ళిపోవడానికి కారణం అక్కడ ఉన్న ఉగ్రవాదానికి మద్దత్తు తెలుపుతున్న ముస్లింలు కాదా, జవాన్ లు అక్కడ చిన్న పిల్లలను గాని, ఆడవాళ్ళని గాని ఎవరిని ఏమి అనరు. కాశ్మీరీలో  చిన్ననాటి నుండే భారత్ పై విష బీజాలు నాటుతున్నారు. ఎవరైతే పాకిస్థాన్ కోసం పని చేస్తూ ఉగ్రవాదం సృష్టిస్తున్నారో వాళ్లపై మాత్రమే భారత్ జవాన్ లు చర్యలు తీసుకుంటారు. V ప్రకాష్ చెప్పే అబద్ధాలని ఎట్టి పరిస్థితులలో నమ్మద్దు. జవాన్ లపై అబద్ధాలని కేవలం పబ్లిసిటీ కోసమో లేక రాజకీయ లబ్ధి కోసమో చెప్తున్నవి.

కింద వీడియో లింక్ ఇస్తున్నాం. చూడండి.

 

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

స్టేజ్ పైనే తెలంగాణ కాంగ్రెస్ నేతల ఫైట్

Share this on WhatsApp ఒక్కసారిగా కాంగ్రెస్ వీహెచ్ తాతయ్య అర్జున్ రెడ్డిలా మారిపోయాడు. వన వం వం వం …