Sunday , September 15 2019
Home / Politics / దేశంలోనే No.1 అప్పుల రాష్ట్రం షేర్ చేయండి

దేశంలోనే No.1 అప్పుల రాష్ట్రం షేర్ చేయండి

తెలంగాణ ప్రజలకి దిమ్మ తిరిగేలా నిజాలు బయటపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 5 ఏళ్ళలో చేసిన అప్పుల గురించి తెలియజేసారు. తెలంగాణ మొత్తం అప్పు రూపాయలు 1,80,239 కోట్లు. ఈ 5 ఏళ్ళలో అప్పు 150 శాతానికి పెరిగిందని తెలియజేసారు. కాంగ్రెస్ ఎంపి మహమ్మద్ ఆలీఖాన్ అడిగిన ప్రశ్నకు నిర్మల సీతారామన్ ఈ విషయాలని బయటపెట్టారు. మన దరిద్రం ఏంటంటే అన్ని పథకాల ద్వారా ఉచితం ఉచితం కావాలంటే ఇవే కాదు ఇంకా ఎక్కువే అవుతాయి. ఇంకో దరిద్రం ఏంటంటే మన రాజకీయ నాయకులు చేసే అవినీతి. లక్ష కోట్ల అప్పు అంటే తెలంగాణలో ఉన్న ప్రతి కుటుంబానికి 50,000 నుండి లక్ష రూపాయల వరకు  అప్పు అవ్వచ్చు. అసలు జూన్ 2014 నాటికి 69,517 కోట్లు అప్పు తెలంగాణపై ఉంది. ఇక టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పు కాస్త 1,80,239 కోట్లు అయ్యింది. ఎఫ్ ఆర్ బి పరిమితికి మించి ఒకసారి అదనంగా అప్పు తెచ్చుకొనేందుకు అనుమతి ఇచ్చింది. దీని కారణంగా 2016-17 లో 8,923 కోట్ల అప్పు తెచ్చారు.

2014 -2015 లో ప్రభుత్వ అప్పు  79,880 కోట్లు ఉండగా వడ్డీ 5,593 కోట్లుగా ఉంది. 2015-2016 లో ఆ అప్పు 97,992 కోట్లు ఉండగా వడ్డీ చెల్లింపు 7,942 కోట్ల రూపాయలుగా ఉంది. తర్వాత 2016-2017 లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అప్పు 1,34,738 కోట్లు అవ్వగా వడ్డీ చెల్లింపు 8,609 కోట్లు అయింది. 2017-2018 లో తెలంగాణ ప్రభుత్వ అప్పు  1,51,133 కోట్లు అవ్వగా వడ్డీ చెల్లింపు  11,139 కోట్లు అయింది. ఇక చివరగా 2018-2019 లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అప్పు 1,80,239 కోట్లు ఉండగా వడ్డీ చెల్లింపు 11,691 కోట్లుగా ఉందని నిర్మల సీతారామన్ గారు తెలియజేసారు. అసలు ఇన్ని ఇన్ని అప్పులు ఎందుకు అవుతున్నాయి. దేశంలో తెలంగాణ రాష్ట్రం అవినీతిలో 2 వ స్థానం. అన్ని ఉచితంగా కావాలంటే కూడా ఇవ్వాలిసినవి కొన్ని ఇచ్చి మిగిలినవి రాజకీయ నాయకులు నాకేస్తారు. ఇక దేశంలో ఎక్కడి లేని విధంగా మంత్రుల, ఎమ్మెల్యేల జీతాలు నెలకి 2.50 లక్షలు ఉన్నాయి. కొంత మంది 2 లక్ష రూపాయలు తీసుకుంటున్నారు. ఇదంతా అవినీతి చేయకుండా ఉండటం కోసమని కెసిఆర్ జీతం పెంచారు. పోనియ్ అవినీతి ఆగిందా అంటే ఇంతకు ముందు కంటే డబల్ అయి దేశంలోనే రెండవ అవినీతి రాష్ట్రంగా ఉంది.

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

TRS మైత్రి వల్లే అక్బరుద్దీన్ పై కేసు లేదు

Share this on WhatsApp మొన్న కరీంనగర్ లో జరిగిన సభలో ఒవైసీ హిందువులని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసాడు. …