Monday , August 26 2019
Home / Politics / వంద కేసులు పెట్టిన ఏమి పీకలేరు – శివాజీ

వంద కేసులు పెట్టిన ఏమి పీకలేరు – శివాజీ

టి‌వి9 రవి ప్రకాష్ కేసులో ప్రధాన భాగస్వామి అయినా శివాజీ ఎట్టకేలకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడు. శివాజీ మాట్లాడుతూ “తనపై మీడియాలో దుష్ప్రచారం జరుగుతోందని, తను ఎక్కడికి పారిపోలేదని, తను విదేశాలకి వెళ్లాడని జరుగుతున్న ప్రచారం అబద్ధం అని అన్నాడు. తనకి ఎండ దెబ్బ తగిలి ఇంట్లో వారం రోజులుగా ఉన్నానని అన్నాడు. శివాజీ అంటే పడని వాళ్ళు దుష్ప్రచారం చేస్తూ శునకానందం పొందుతున్నారని  అన్నాడు.  జై ఆంధ్ర ఉద్యమంలో ఎంతో మంది జైలు కి వెళ్లారని, నేను జైలు అంటే భయపడనని , పోలీసులు జైలుకు  వెళ్ళగానే ఏమైనా నన్ను చంపేస్తారా అని అన్నాడు. ఎవరు తనని ఏమి చేయలేరని, 100 కేసులు పెట్టినా ఎవరు తనని ఏమి చేయలేరని అన్నాడు.

శివాజీ ఇంకా మాట్లాడుతూ “ఆంధ్రలో తను అంటే పడని వాళ్ళు తెలంగాణ వాళ్ళతో కలిసి కేసులో ఇరికించారని అన్నారు. తనకు స్థానబలం లేదని తెలంగాణ పోలీసులు ఇలా అక్రమ కేసుల్లో ఇరికిస్తున్నారని అన్నాడు. కొన్ని రోజులు గడిస్తే ఈ కేసులు చెల్లకుండా పోతాయని చెప్పాడు. పోలీసులు తన ఇంట్లో సోదాలు చేస్తే ఏమి దొరకలేదని మరియు టి‌వి9 రవి ప్రకాష్ కి , శివాజీకి మధ్య వేరే కేసు నడుస్తోందని అన్నాడు. కౌశిక్ రావు కావాలనే తనపై కేసు పెట్టాడని అన్నాడు. తనని కావాలనే ఇరికించాలని ప్రయత్నిస్తున్నారని, తెలంగాణ పోలీసులు చిట్టీల పేర్లతో అక్రమాలు చేసే వాళ్ళని పట్టుకోవడానికి సాక్ష్యం కావాలని అడుగుతారు. శివాజీపై ఎలాంటి ఆధారం లేకుండా తనపై అక్రమంగా కేసు పెట్టారని అన్నాడు.

Watch and Share It:

 

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

అక్బరుద్దీన్ కి వార్నింగ్ ఇచ్చిన రాజాసింగ్

Share this on WhatsApp మొన్న హైదరాబాద్ లో అక్బరుద్దీన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో అందరూ మండిపడుతున్నారు. …