Sunday , February 24 2019
Home / National / శారద స్కామ్ పూర్తి వివరాలు-మమతా బెనర్జీ

శారద స్కామ్ పూర్తి వివరాలు-మమతా బెనర్జీ

  • 2006 సంవత్సరంలో పశ్చిమ బెంగాల్ లోని ‘శారద చిట్ ఫండ్ కంపెనీ’ ఎక్కువ వడ్డీ ఇస్తామని ప్రజల దగ్గర నుండి డబ్బులు వసూల్ చేసింది. ఇలా ప్రతి సంవత్సరం కొంత డబ్బు చొప్పున ఆ చిట్ ఫండ్ కంపెనీకి 10 సంవత్సరాలు కడితే ఎక్కువ వడ్డితో డబ్బులు తిరిగి ఇస్తామని ఆశ చూపెట్టింది.
  • అలాగే ప్రజలు పది సంవత్సరాలు డబ్బులు కట్టారు. 10 సంవత్సరాలు పూర్తి అయ్యాక కంపెనీకి వెళ్తే డబ్బులు ఇవ్వమని చేతులు ఎత్తేశారు. అంటే ఇక్కడ వడ్డీయే కాదు అసలు కూడా ఇవ్వలేదు. ప్రజలు నిండా మునిగారు.
  • ఈ శారద కుంభకోణం (స్కామ్) 2013 లో బయటపడింది. ఈ స్కామ్ విలువ 2,460 కోట్లు.
  •  ప్రజల నుండి సంపాదించిన 2,460 కోట్ల డబ్బుని శారద కంపెనీ మిగతా వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టి పూర్తిగా నష్టపోయింది. ఇక ప్రజలకి డబ్బులు ఇవ్వలేమని చెప్పింది.
  • మొత్తం 17 లక్షల మంది ప్రజలు ఈ స్కామ్ ద్వారా మోసపోయారు. మోసపోయిన ప్రజలు చాలా మంది పశ్చిమ్ బెంగాల్ హైకోర్ట్ లో కేసు వేశారు. అయితే ఈ కేసుపై దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్ ని నియమించారు. కానీ వీళ్ళు చేస్తున్న దర్యాప్తుకి భాదితులు న్యాయం జరగడం లేదని, సుప్రీం కోర్ట్ లో కేసు వేశారు.
  • సుప్రీం కోర్ట్ కేసు గురించి విచారించి 2014 లో CBI ని రంగంలోకి దింపింది. తర్వాత CBI అధికారులు స్కామ్ దర్యాప్తులో చాలా విషయాలు బయట పెట్టారు.
  • ఈ శారద స్కామ్ ఒక పశ్చిమ్ బెంగాల్ లోనే కాదు, పక్కనే ఉన్న అస్సాం,ఒరిస్సా, బీహార్ రాష్ట్రాల్లో కూడా జరిగింది.
  • ఈ స్కామ్ జరిగినప్పుడు తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ అధికారంలో ఉంది. అప్పుడు తృణమూల్ కాంగ్రెస్ నాయకులు శారద చిట్ ఫండ్ కంపెనీకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా డబ్బులు తీసుకున్నారనే విషయాలు బయటకు వచ్చాయి. అలాగే చాలా వ్యాపార విషయాలలో మమతా ప్రభుత్వం శారద చిట్ ఫండ్ కంపెనీకి అండగా ఉంది.
  • అలాగే ఈ శారద స్కామ్ మాత్రమే కాదు. ఇంకా వేరే వ్యాపార విషయాలకి సంబంధించి apporval కూడా తృణమూల్ కాంగ్రెస్ నాయకులు ఇచ్చారు. అందు కారణంగా 4 గురు తృణమూల్ కాంగ్రెస్ నాయకులను తర్వాత CBI అరెస్ట్ చేసింది.
  • ఇంకా ఈ స్కామ్ లో పోలీసు కమిషనర్ రాజీవ్ కూమర్ కూడా ఉన్నాడు. ఎలా అంటే రాజీవ్ కూమార్ ఈ కేసు కి సంబంధించిన పూర్తి సమాచారం CBI కి అందించకుండా కొంత సమాచారాన్ని కాల్చేశాడు. ఈ విషయంలో రాజీవ్ కూమార్ పై కేసు కూడా ఉంది.
  • అయితే ఇదే విషయంపై CBI అధికారులు చాలా సార్లు రాజీవ్ కూమార్ కి నోటీస్ లు పంపారు. అలా పంపిన కూడా రాజీవ్ కూమార్ సరిగ్గా స్పందించలేదు. రాజీవ్ కూమర్ కనీసం ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయడం లేదు. ఈ స్కామ్ పై CBI దర్యాప్తు మొన్ననే తీవ్రతరం చేసింది.  వెంటనే 40 మంది CBI అధికారులు నేరుగా రాజీవ్ కూమార్ ఇంటికి వెళ్లారు.
  • రాజీవ్ కూమర్ ఇంటి ముందు ఉన్న సెక్యూరిటి వాళ్ళు, లోపలికి CBI అధికారులని వెళ్లనివ్వకుండా “వారంట్ ” ఉందా అని అడిగారు. కానీ CBI వాళ్ళు ఇది ఒక రహస్యమైన ఆపరేషన్ అని చెప్పారు. వెంటనే secuirty వాళ్ళు పోలీసులకి ఫోన్ చేశారు. ఈ విషయం మమతా బెనర్జీకి తెలిసి తర్వాత CBI వాళ్ళని మమతా పోలీసులతో అరెస్టు చేయించింది.
  •  ఈ విధంగా రాజీవ్ కూమర్ ని మమతా బెనర్జీ కలిసి ఇదంతా బి‌జే‌పి చేయిస్తున్న కుట్ర అని చెప్పి, మమతా కల్పిత కథలతో ధర్నా ప్రారంభించింది. అసలు CBI కి బి‌జే‌పి కి సంబంధం లేదు. తృణమూల్ కాంగ్రెస్ యొక్క చరిత్ర బయటపడుతుందని మమతా భయం.
  • రాజీవ్ కూమర్ ని కనుక ఇన్వెస్టిగేట్ చేస్తే అన్ని నిజాలు బయట పడతాయి. పూర్తిగా మమతా బెనర్జీ ఒక పోలీసుని కాపాడటంలో ఉద్దేశం ఏంటో బయట పడుతుంది. ఈ స్కామ్ లో చాలా మంది తృణమూల్ రాజకీయ నాయకులు ఉన్నారు.
  • ఇప్పుడు ధర్నా చేస్తున్న మమతా బెనర్జీ కి చంద్రబాబు కూడా మద్దత్తు చేస్తున్నాడు.
  • పూర్తి విషయం కోసం వీడియో చూడగలరు.

Watch and Share It:-

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

మీ జవాన్ల శవపేటికలు కొనసాగుతాయి – పాకి పంది

Share this on WhatsApp పుల్వామాలో జరిగిన దాడిలో 44 మంది జవాన్లు చనిపోయిన తర్వాత దేశంలో ఒక్కసారిగా విషాద …