పుల్వామాలో 44 మంది జవాన్ లు చంపబడిన తర్వాత దేశ వ్యాప్తంగా ఉగ్రవాదంపై మరియు పాకిస్థాన్ పై ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. దేశ ప్రజలు అంతా “దెబ్బ కి దెబ్బ పాకిస్థాన్ కి చూపించాలంటూ” సోషల్ మీడియాలో వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే గోషా మహల్ MLA రాజా సింగ్ గారు కొవ్వత్తులతో జవాన్లకి నివాళులు అర్పించారు.
గోషా మహల్ MLA రాజా సింగ్ గారు మీడియా ముందు మాట్లాడుతూ ” పుల్వామా జరిగిన దాడికి ప్రతి భారతీయుడి మనసులో బాధ ఉందని, ఎట్టి పరిస్థితులలోనైనా పాకిస్థాన్ కి బుద్ధి చెప్పాలని అన్నారు. ప్రస్తుతం హిందూ వాహిని మరియు బిజేపి కార్యకర్తలు కొవ్వత్తుల ర్యాలీలో పాల్గొనడం మాత్రమే కాదు, అవసరమైతే దేశం కోసం యుద్ధం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. దేశానికి ఒకవేళ సైన్యం అవసరం ఉంటే ఖచ్చితంగా తాము ముందు ఉంటామని చెప్పారు. మోడీగారు ఆర్మీ కి ఇచ్చిన powers కి ధన్యవాదాలు” తెలియజేశారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి మోడీ గారు మంచి నిర్ణయం తీసుకున్నారని అన్నారు. దేశం కోసం ప్రాణం తీయడానికైనా, ఇవ్వడానికైనా రెడీ అని అన్నారు.
Watch this Video:-
కన్నీళ్ళు తెప్పించే వీడియో :-