Thursday , October 17 2019
Home / Politics / బి‌జే‌పి MLA రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు

బి‌జే‌పి MLA రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు

యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉండి ఎక్కువగా ప్రజల గుండెల్లో ఉన్న వాదనలని మరియు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలని చేసే లీడర్ బి‌జే‌పి ఎం‌ఎల్‌ఏ  రాజా సింగ్. ఈయన కి గోవులన్న, హిందుత్వమన్న చాలా ఇష్టం. అవసరమైతే ప్రాణం ఇవ్వటానికైనా రెడీగా ఉన్నానని చాలా సంధర్భాల్లో మీడియా ముందు రాజా సింగ్ చెప్పారు. అయితే మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూరులో జరిగిన ఎం‌పి‌టి‌సి  ఎన్నికలలో బి‌జే‌పి విజయం సాధించింది. విజయోత్సాహంతో బి‌జే‌పి కార్యకర్తలు ర్యాలీ చేస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో ఓటమిని జీర్ణించుకోలేక పోయినా టి‌ఆర్‌ఎస్  కార్యకర్తలు రగిలిపోయారు. ర్యాలీలో పాల్గొన్న బి‌జే‌పి కార్యకర్త  ప్రేమ్ కుమార్ తో టి‌ఆర్‌ఎస్  కార్యకర్తలు గొడవ పడి రాడ్ తో, కత్తులతో దాడి చేశారు. ఇదే విషయంపై రాజా సింగ్ మాట్లాడారు.

రాజా సింగ్ మాట్లాడుతూ “ఇలా చంపడం చాలా పెద్ద తప్పు అని, బి‌జే‌పి కార్యకర్త ప్రేమ్ కుమార్ ని టి‌ఆర్‌ఎస్  కార్యకర్తలు చంపడం చాలా బాధకారమని అన్నారు. టి‌ఆర్‌ఎస్  పార్టీ గెలవకపోతే వేరే గెలిచిన పార్టీ వాళ్ళను బ్రతకన్నివ్వరా? చంపేస్తారా? అని రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులు తక్షణమే ఈ హత్య చేసిన క్రిమినల్స్ ని వెంటనే పట్టుకొని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై కరీంనగర్ ఎం‌పి బండి సంజయ్ గారు స్పందిస్తూ బాధని తెలియజేశారు. ఇక మహబూబ్ నగర్ లో బి‌జే‌పి తరుపున ఎం‌పిగా పోటీ చేసిన డి‌కే అరుణ గారు వెళ్ళి ప్రేమ్ కుమార్ తల్లిని పరామర్శించారు. నేరస్థులని కటినంగా శిక్షించాలని రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఈ రోజు ఉదయం ఒక ఇన్స్పెక్టర్ పోలీసు టోపిని తీసెసి ముస్లిం టోపీని డ్యూటీ లో పెట్టుకుని ముస్లింలకి రంజాన్ శుభాకాంక్షలు చెప్పాడు. దీనిపై రాజా సింగ్ స్పందిస్తూ “ఇన్స్పెక్టర్ డ్యూటీ లో ఉండగా రూల్స్ ని అతిక్రమిస్తూ టోపీ పెట్టుకున్నాడని, ఇలా రంజాన్ విషెస్ చెప్పాలంటే డ్రెస్ మార్చుకొని చెప్తే బాగుండేదని అన్నారు. ఇలా రూల్స్ ని అతిక్రమించి టోపీ పెట్టుకోమని మీ ముఖ్యమంత్రి చెప్పాడా అని రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకా హిందూ పండులకి దౌర్జన్యంగా లాఠీ ఛార్జీలు చేస్తారని, వినాయక ఉత్సవాలలో డి‌జే ని అనుమతించరని వ్యాఖ్యలు చేశారు.

ఇక మొదట విషయం గురించి మాట్లాడుకుంటే మరీ ఇంత దారుణంగా పార్టీల కోసం చంపుతారా? ఒక తల్లికి బిడ్డని దూరం చేశారు. ఆ తల్లి బ్రతికి ఉండగానే కొడుకు శవం కాటికి వెళ్తుంటే చూడగలదా? ఎంత బాధ ఉండాలి ఆ తల్లికి. పార్టీల గెలుపు ఓటములు సహజం. ఓడిపోయామనో లేక ఎదుటి వాళ్ళు గెలిచారనో చంపడం కరెక్టేనా?, ఆ తల్లికి తిరిగి తన బిడ్డని ఏ పార్టీ ఇస్తుంది. ఏ నాయకుడు తెచ్చి ఇవ్వగలడు ఆ తల్లి యొక్క బిడ్డ ప్రాణాన్ని.

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

TRS మైత్రి వల్లే అక్బరుద్దీన్ పై కేసు లేదు

Share this on WhatsApp మొన్న కరీంనగర్ లో జరిగిన సభలో ఒవైసీ హిందువులని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసాడు. …