మొన్న కరీంనగర్ లో జరిగిన సభలో ఒవైసీ హిందువులని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసాడు. అంతకుముందు 2013 లో అక్బరుద్దీన్ ఒక సభలో 15 నిమిషాలు పోలీస్ లు పక్కకు జరిగితే హిందువులని దేశంలో లేకుండా చేస్తానని వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. అప్పటి ప్రసంగాన్ని కరీంనగర్ సభలో గుర్తు చేస్తూ “15 నిమిషాల దెబ్బ నుండి ఇంకా హిందువులు కోలేకపోతున్నారని అన్నాడు. అలాగే RSS మా వెంట్రుక కూడా పీకలేదని అన్నాడు. ఇంకా BJP కరీంనగర్ లో గెలవడం బాధగా ఉందని చెప్పాడు. అక్బరుద్దీన్ మాటలకి BJP నాయకులు రాజా సింగ్ , బండి సంజయ్ మరియు అరవింద్ గార్లు తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. అలాగే BJP నాయకులు అక్బరుద్దీన్ కేసు కూడా నమోదు చేస్తున్నట్లు తెలియజేసారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోతే కేంద్ర ప్రభుత్వం NIA కి కేసుని అప్పగిస్తామని BJP నాయకులు సూచించారు.
ప్రస్తుతం ప్రొఫెసర్ కే నాగేశ్వర్ ఇదే అంశంపై తన You Tube Channel లో మాట్లాడారు. అక్బరుద్దీన్ చాలా దుర్మార్గమైన వ్యాఖ్యలు చేసాడని, లౌకిక వాదులు ఇలాంటి వ్యాఖ్యలని ఖచ్చితంగా వ్యతిరేకించాలని సూచించారు. గతంలో కూడా ఇలాంటి దుర్మార్గమైన వ్యాఖ్యలు చేసాడని, 15 నిమిషాలలో పోలీస్ లు పక్కకి ఉంటే హిందువులని లేకుండా చేస్తానని అన్నాడు. TRS , MIM కి ఉన్న మైత్రి వల్లే అక్బరుద్దీన్ పై ఎలాంటి కేసు లేదని అన్నాడు. అందుకే కేంద్రం ఈ కేసుని NIA కి అప్పగించే అవకాశం ఉందని అన్నారు. KTR ఈ మధ్య BJP తక్కువ అంచనా వేయొద్దని అన్నారు. అలాగే దేశ వ్యాప్తంగా రోజు రోజుకి BJP పెరుగుతోందని అంటున్నారు. ఇలాంటి వ్యాఖ్యలని TRS ఖండించకపొతే ఇలాగే BJP హవా పెరుగుతుందని అన్నాడు.
Watch and Share It:-