Friday , August 23 2019
Home / National / దేశాన్ని, జవాన్ లని అవమానించారు ఓడారు

దేశాన్ని, జవాన్ లని అవమానించారు ఓడారు

భారతదేశంలో ఉంటూ ఇక్కడి గాలి పిలుచుకుంటూ ఇక్కడి తిండి తింటూ దేశాన్ని గౌరవించకుండా మరియు జవాన్లని గౌరవించకుండా రాజకీయ ఎదుగుదల కోసం కొందరు నాయకులు దేశద్రోహ వ్యాఖ్యలు చేశారు. ఇవి ప్రజలు గుర్తు పెట్టుకున్నారా లేదా అనే విషయం ఎన్నికల ఫలితాలలో కొంత కనిపించిందా లేదా చూద్దాము. కొన్ని కారణాలు వివరిస్తాను. ఎన్నికలు వస్తుండగానే మన దేశంలో దిగజారుడు వ్యాఖ్యలు చేయడం, దిగజారుడు రాజకీయం చేయడం ఫ్యాషన్ అయిపోయింది.

గమనిక :- పోస్ట్ కాపీ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోబడును ,

ముందుగా సీతారాం ఏచూరి కమ్యూనిస్ట్ నాయకుడు. 1) ఈయన అఫ్జల్ గురు అనే ఉగ్రవాదిని ఉరి తీస్తామంటే, దేశ వ్యాప్తంగా ఉరిని వ్యతిరేకిస్తూ కమ్యూనిస్ట్ ల తరుపున ధర్నాలు, ర్యాలీలు చేయించాడు. ( అఫ్జల్ గురు గురించి వివరణ: వీడు జైషే ఏ మహమ్మద్ అనే సంస్థకి చెందిన ఉగ్రవాది.  2001 లో పార్లమెంట్ భవన సముదాయంలో 5 గురు ఉగ్రవాదులు చేరి దాడికి పాల్పబడ్డారు.  అందులో ప్రధాన పాత్ర వహించిన వ్యక్తి. వెంటనే ఢీల్లి పోలీసులు అఫ్జల్ గురుని పట్టుకొని కోర్ట్ లో హాజరు పరిచారు. కోర్ట్ తీర్పు ప్రకారం ఉరి తీయాల్సి ఉండగా అఫ్జల్ గురు భార్య క్షమాభిక్ష పిటిషన్ పెట్టడంతో 2006 నుండి కేసు పెండింగ్ లో పడింది. మొత్తానికి 2013 లో తిహార్ జైలులోనే ఉరితీశారు.), 2 ) ఇక రెండవ సంఘటన ఒక ఇంటర్వ్యూ లో సీతారాం ఏచూరి మాట్లాడుతూ “పాకిస్థాన్ కి జై కొడితే తప్పు ఏంటని, పాకిస్థాన్ జిందాబాద్ అంటే తప్పు ఏంటని, పాకిస్థాన్ తో సంబంధాలు పెట్టుకోవడానికి ఏదైనా చేయాలని” అన్నాడు. 3 ) భారత్ మాతాకీ జై అనను అని వ్యాఖ్యలు చేశాడు. అలాగే ప్రతిసారి కమ్యూనిస్ట్  పార్టీని ఓడించినట్టే ఈ సారి కూడా ప్రజలు ఎలెక్షన్స్ లో చిత్తు చిత్తుగా ఓడించారు.

కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నాయకులు దేశ ద్రోహ వ్యాఖ్యలు చేశారు. 1) అందులో ముందుగా జమ్ము కాశ్మీర్ చెందిన కాంగ్రెస్ నాయకుడు సఘీర్ సయీద్ ఖాన్ మాట్లాడుతూ “కాంగ్రెస్ అధికారంలోకి వస్తే , జవాన్ లు చంపిన ఉగ్రవాదుల కుటుంబాలకి ఒక కోటి రూపాయలు మరియు ఇంటికొక ఉద్యోగం ఇస్తానని చెప్పాడు. ఇలాంటి దేశ ద్రోహ వ్యాఖ్యలని ఖండించడం గాని, సఘీర్ సయీద్ ఖాన్ ని పార్టీ నుండి తీసివేయడం గాని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేయలేదు. 2) అఫ్జల్ గురుని ఉరి తీసిన తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కొందరు ముస్లింలు ఉగ్రవాదులని సపోర్ట్ చేస్తూ “అఫ్జల్ గురు ఒక్కడు చస్తే ఇంటికొక అఫ్జల్ గురు పుట్టుకొస్తాడని” ప్లకార్డ్లు పట్టుకొని రాత్రి సమయంలో ర్యాలీలు చేశారు. అలాగే ఢీల్లి జే‌ఎన్‌యూ యూనివర్సిటీలో కన్నయ్య కుమార్ , ఒమర్ ఖలిద్ లు ర్యాలీలు చేస్తూ పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు చేశారు. ఇంకా “భారత్ నాశనం అయ్యే వరకు పోరాడుతామని నినాదాలు చేశారు. ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ రాహుల్ గాంధీ వెళ్ళి కలిశాడు. 3) పుల్వమా ఘటన జరిగిన తర్వాత జవాన్లు జరిపిన సర్జికల్ స్ట్రైక్ కి ఆధారాలు చూపించమని రాహుల్ గాంధీ అన్నాడు. 4) కాంగ్రెస్ గెలిస్తే Sedition Law ని తీసేస్తామని చెప్పింది. అసలు sedition law ఉద్దేశం: దేశ ద్రోహ చర్యలకి పాల్పడితే గాని, దేశ ద్రోహ వ్యాఖ్యలు చేస్తే గాని సెక్షన్ 124 ఏ కింద అరెస్టు చేస్తారు. అలాంటి చట్టాన్ని తీసేయాలని చూశారు. అంటే పాకిస్థాన్ జిందాబాద్ అని చెప్పిన కూడా కేసులు ఉండవు. ఇది ముస్లిం ఓటు బ్యాంక్ కోసం చేసిన అంశం. ఇక ఇన్ని దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడిన కాంగ్రెస్ ఎన్నికలలో దారుణంగా ఓడిపోయింది. 5) మసూద్ అజర్ ని రాహుల్ గాంధీ “గారు”అని సంభోదిస్తూ దేశ ద్రోహ వ్యాఖ్యలు చేశాడు. 6) అలాగే నవజోత్ సింగ్ మన భారత ఆర్మీని అవమానిస్తూ సర్జికల్ స్ట్రైక్స్ జరగలేదని అబధ్ధమని అన్నాడు. మొన్న జరిగిన ఎన్నికలలో రాహుల్ గాంధీ అమేధి లో ఓడిపోతే రాజకీయాల నుండి తప్పుకుంటానని అన్నాడు. స్మృతి ఇరానీ చేతిలో కాంగ్రెస్ కి కంచు కోట అయినా అమేధిలో రాహుల్ గాంధీ ఓడిపోయాడు. అయితే నవజ్యోత్ సింగ్ ని సోషల్ మీడియాలో ప్రజలు ఎప్పుడు రాజకీయాల నుండి తప్పుకుంటున్నావని ప్రశ్నిస్తున్నారు. 7) దిగ్విజయ్ సింగ్ కూడా భారత ఆర్మీని అవమానిస్తూ ట్విటర్ అక్కౌంట్ లో సర్జికల్ స్ట్రైక్ ఆధారాలు చూపెట్టాలని, లేని పక్షంలో ఇది కేవలం రాజకీయ లభ్ధి కోసం చేసిన పని అని అన్నాడు. అలాగే ఓడిపోయాడు. 8) కాంగ్రెస్ అధికారంలో జవాన్ లకి కనీసం మంచి బూట్లని కూడా ఇవ్వలేదు, అలాగే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లు అడిగినా ఇవ్వలేదు. యుద్ధ విమానాల అవసరం ఉందని చెప్పినా డీల్ చేసి అందులో కూడా స్కామ్ లు చేశారు. 9) దేశంలో విపరీతమైన స్కామ్ లు 70 ఏళ్ళుగా కాంగ్రెస్ చేస్తూ వస్తూనే ఉంది.

కన్నయ్య కుమార్ మొదట జే‌ఎన్‌యూ యునివర్సిటిలో అఫ్జల్ గురు ఉగ్రవాదిని ఉరి తీసినందుకు ర్యాలీలు చేశాడు. 1) అందులో ముఖ్యంగా భారత్ కీ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అందులో “భారత్ నాశనం అయ్యే వరకు పోరాడుతామని, కాశ్మీర్ కి స్వతంత్రం తెస్తామని, భారత్ ముక్కలు ముక్కలు అయ్యే వరకు పోరాడుతామని” నినాదాలు చేశారు. ఇప్పటికీ ఢీల్లి లో సెక్షన్ 124 ఏ కింద కేసు నడుస్తోంది. 2) లాన్స్ నాయక్ హనుమంతప్ప వీర జవాన్ -40 డిగ్రీల చలిలో 27 అడుగుల లోతులో కూరుకుపోయి 5 రోజులు తిండి లేకుండా బ్రతికి చివరకి చనిపోయాడు. ఆయన గురించి దేశం అంతా దుఖంలో ఉంటే కన్నయ్య కుమార్, ఒమర్ ఖలీద్ times now అర్నాబ్ గోసామి debate లో కూర్చొని నవ్వుకుంటూ చేరారు. వెంటనే అర్నాబ్ గోసామి ఇద్దరికీ పగిలి పోయేలా మాటల తుటాలు వదిలి తాట తీశాడు. మొన్న జరిగిన ఎన్నికల్లో కన్నయ్య కుమార్ పోటీ చేసి పరమ చెత్తగా చిత్తుగా ఓడిపోయాడు.

మెహబూబా ముఫ్తి కాశ్మీర్ వేర్పాటు వాదుల కోసం అవసరమైతే పాకిస్థాన్ కి కూడా సపోర్ట్ చేస్తానని చెప్పింది. ఇంకా ఆర్టికల్ 35 A తీస్తే కాశ్మీర్ యువకుల చేతిలో పాకిస్థాన్ జెండాలు ఉంటాయని, అలాగే 1947 నుండి కాశ్మీర్ లో ఎన్నడూ చూడలేని దారుణమైన ఘటనలు చోటు చేసుకుంటాయని వార్నింగ్ అంటూ మీడియా ముందు చెప్పింది. ఇప్పుడు జరిగిన లోక్ సభ ఎన్నికలలో మెహబూబా ముఫ్తీ ఓడిపోయింది.

తెలంగాణ కే‌సి‌ఆర్ బిడ్డ కవితా ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో 2013 లో ఈమె కాశ్మీర్ పాకిస్తాన్ దేనని దేశ ద్రోహ వ్యాఖ్యలు చేసింది. అప్పుడే తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంది. నల్గొండలో జరిగిన సభలో కే‌సి‌ఆర్ మాట్లాడుతూ సర్జికల్ స్ట్రైక్స్ జరగలేదని ఉగ్రవాది మసూద్ అజర్ అన్నాడని చెప్పాడు. 300 మంది ఉగ్రవాదులు చనిపోవడం అనేది వట్టి డొల్ల ప్రచారం అని జవాన్ లని అవమానించాడు. అక్కడ కనీసం చీమ కూడా చనిపోలేదని మసూద్ అజర్ చెప్పాడని అన్నాడు. అలాగే కే‌సి‌ఆర్ హిందువులని పట్టుకొని హిందూ గాళ్ళు బొందు గాళ్ళు అనడం తీవ్ర స్థాయిలో టి‌ఆర్‌ఎస్ ని దెబ్బతీసింది.

చంద్రబాబు కూడా పాకిస్థాన్ వాళ్ళు చెప్తున్నారని “బాలకోట్ ఉగ్రవాదుల చనిపోలేదని భారత ఆర్మీపై దేశద్రోహ వ్యాఖ్యలు” చేశాడు. ఇక రాహుల్ గాంధీయే కాదు, కేజ్రీవాల్ కూడా జే‌ఎన్‌యూ యూనివర్సిటీ లో దేశ ద్రోహ వ్యాఖ్యలు చేసిన వారికి మద్దత్తు తెలియజేశాడు. కమల్ హాసన్ , ప్రకాష్ రాజ్ లు “జనగణమన సినిమా హల్లాలో పెట్టకూడదని అన్నారు. అలాగే పవన్ కల్యాణ్ కూడా “సినిమా హాల్ లల్లో నిలబడి దేశభక్తి నిరూపించుకోవాలా అని దేశ ద్రోహ వ్యాఖ్యలు చేశాడు. అలాగే హిందూ ధర్మాన్ని, హిందువులని అవమానించిన వాళ్ళలో ప్రకాష్ రాజ్ , కమల్ హాసన్ , సీతారాం ఏచూరి ఉన్నారు. మాయావతి, మమతా బెనర్జీ సర్జికల్ స్ట్రైక్ పై అనుమానాలు ఉన్నాయని, దానికి సంబంధించిన ఆధారాల వీడియోని రీలీజ్ చేయాలని భారత్ ఆర్మీని డిమాండ్ చేశారు. అందుకే వీళ్ళందరికి ఎన్నికలలో చాలా బాగా ప్రజలు సమాధానం ఇచ్చారు.

ఇక అసదుద్దీన్ ఓ‌వై‌సి కూడా కొన్ని సందర్భాలలో దేశ ద్రోహ కామెంట్లు చేశాడు. కానీ ఎలెక్షన్ లో గెలిచాడు. ఎందుకు గెలిచాడు అంటే ఒకే రకమైన మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఓటు వేయడం వల్ల అని చెప్పచ్చు. కానీ సర్జికల్ స్ట్రైక్ తర్వాత పాకిస్థాన్ కి మరియు ఉగ్రవాదులకి వార్నింగ్ ఇచ్చాడు. ఉగ్రవాదులని రాక్షసులు అన్నాడు. మీరు చేస్తున్న ఉగ్రవాదం అల్లాహ్ మార్గం కాదని చెప్పాడు. మేము ఉన్నంత వరకు భారత్ లో ఉన్న ఆలయాలలో గంటల శబ్దం వినిపిస్తుందని మహారాష్ట్రలో జరిగినా సభలో అన్నాడు. కానీ అంతకు ముందు అసదుద్దీన్ తమ్ముడు అక్బరుద్దీన్ మాట్లాడినా దేశ ద్రోహ ప్రసంగం తర్వాత దేశ వ్యాప్తంగా తీవ్రస్థాయిలో విమర్శలు ఎదురుకొన్నాడు. దేశవ్యాప్తంగా కేసులు కూడా అయ్యాయి.

పోస్ట్ కాపీ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోబడును

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

అక్బరుద్దీన్ కి వార్నింగ్ ఇచ్చిన రాజాసింగ్

Share this on WhatsApp మొన్న హైదరాబాద్ లో అక్బరుద్దీన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో అందరూ మండిపడుతున్నారు. …