Tuesday , June 18 2019
Home / National / హిందూ ధర్మం దెబ్బ గట్టిగా తాకిన నాయకులు

హిందూ ధర్మం దెబ్బ గట్టిగా తాకిన నాయకులు

హిందువులని గాని, హిందూ ధర్మాన్ని గాని, హిందూ దేవుళ్ళని గాని అవమానించిన వాళ్ళు ఈ ఎలెక్షన్స్ లో ఎలా ఓడిపోయారో మీరే చూడచ్చు. ఇంతకీ వాళ్ళు చేసిన పనులు ఏంటి? , మాట్లాడినా తప్పుడు మాటలు ఏంటి? ఇది కేవలం ధర్మ అధర్మ కార్యాలు చేస్తే ఇలా జరుగుతుందని చెప్పడానికే. ఎవరిని అవమానించి రాస్తున్నది కాదు, తిరిగి వాళ్ళు తమ తప్పుని తెలుసుకుంటారనే ఆశతో రాస్తున్నాము.

ముందుగా చంద్రబాబు గురించి తీసుకుంటే ఆంధ్రలో ఎంతటి ఘోర పరాభావాన్ని ఎదురుకొన్నాడో అందరికీ తెలిసిన విషయం. ఈయన చేసిన మొదటి తప్పు 1) విజయవాడలో 30 దేవాలయాల కూల్చివేత. 2) కలియుగ  దైవం వెంకటేశ్వరుడి ఆభరణాలలో రూ.500 కోట్ల విలువైన పింక్‌ డైమండ్‌ మాయం, గోవింద రాజ స్వామి ఆలయంలో మూడు బంగారు కిరీటాలు మాయం 3)  పీఠాధిపతులని లెక్క చేయకుండా అవమానించడం. 4) చంద్రబాబు దైవ కార్యాలలో బూట్లు వేసుకొని పూజలు చేయడం, బూట్లతోనే దేవుళ్ళకి నమస్కరించడం చేశారు. 5) దేవాలయాల ద్వారా వచ్చిన డబ్బుతో పార్టీ కార్యక్రమాలకు, విదేశీ ప్రయాణాలకు వాడుకోవడం, మొత్తానికి ఘోరమైన పరాజయాన్ని చంద్రబాబు చవి చూశాడు. విశాఖ శారద పీఠం స్వామీజీ స్వరూపానందేంద్ర ఇప్పటికే పీఠాధిపతులని ఆగ్రహానికి గురి చేస్తే ఇలాగే పీఠాలు కదులుతాయని సమాధానం జగన్ గెలుపుతో ఇచ్చారు.

ఇక రెండో వ్యక్తి కమల్ హాసన్ ఓడిపోవడానికి హిందువులని, హిందూ ధర్మాన్ని, హిందూ దేవుళ్ళని అవమానించడమే. అందులో కొన్ని 1 ) ఈయన చెప్పిన వ్యాఖ్యలు “రోజు గుడి ముందు అడుక్కునే బిచ్చగాడికి ఏమి చేయని దేవుడు, ఎప్పుడో ఒకసారి వెళ్ళి పూజలు చేసే నిన్ను కరుణిస్తాడా అంటూ హిందువుల నమ్మకాలని దెబ్బతీయడానికి ప్రయత్నించాడు. 2) అన్నీ జీవుల మాంసం తింటానని అందులో ఆవు మాంసం కూడా తింటానని కమల్ హాసన్ అన్నాడు, ఆవు మాంసం తింటే తప్పు ఏంటి అని కూడా ప్రశ్నించాడు. 3) ముస్లిం ఓట్ల కోసం హిందూ ఉగ్రవాదం అని హిందువుల మనోభావాలు దెబ్బతీశాడు. 4 ) దేశంలో మొదటి ఉగ్రవాది హిందువేనని హిందువులని అవమానించాడు.

ఇక కాంగ్రెస్ ఓటమికి కారణాలు చాలా ఉన్నాయి. 1 ) పీఠాధిపతులపై, హిందువులపై అక్రమంగా దాడులు చేయించడం 2) హిందూ ఉగ్రవాదం అనే పదాన్ని కాంగ్రెస్ తమ రాజకీయం కోసం సృష్టించడం. 3) ప్రతిసారి మైనారిటీ ఓట్ల కోసం హిందువులపై, హిందూ గ్రంథాలపై, దేవి దేవతలపై అవమానకర వ్యాఖ్యలు చేయడం, 4) గోమాంసం తింటే తప్పు ఏంటని వ్యాఖ్యలు చేయడం, 5 ) అలాగే ఈ జవాన్లు చేసిన త్యాగాలను కించ పరిచేలా మాట్లాడటం, 6) కాశ్మీర్ ని పాకిస్థాన్ కి ఇచ్చేస్తామని చెప్పడం.

ప్రకాష్ రాజ్ బెంగళూర్ సెంట్రల్ నుండి పోటీ చేసి ఘోర ఓటమిని చవి చూశారు. ఇంతకు ముందు హిందువుల మనోభావాలు దెబ్బతినెలా చాలా వ్యాఖ్యలు చేశాడు. 1) గోమాంసం తింటే తప్పు ఏంటి అని అన్నాడు. 2) హిందూ ఉగ్రవాదం అంటూ హిందువులని అవమానించాడు. 3) హిందువులు ముస్లింలపై దాడులు చేస్తున్నారని అబద్ధపు ప్రచారాలు చేశాడు.

కమ్యూనిస్ట్ పార్టీ సీతారాం ఏచూరి మాటలు తన పార్టీని పూర్తి సంక నాకించేశాయని చెప్పచ్చు. గతంలో కూడా ఈ పార్టీ పెద్దగా గెలిచింది కూడా ఏమి లేదు. రామాయణం, మహాభారతాలు హింసని ప్రేరేపించాయని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. గతంలో దుర్గమాతని వేశ్యఅంటూ హిందూ ధర్మాన్ని అవమానించాడు. ఎప్పటిలాగే ఎలెక్షన్స్ లో చిత్తు చిత్తుగా కమ్యూనిస్ట్ పార్టీ ఓడిపోయింది.

ఇక కార్ సార్ పదహార్ కేంద్రం లో సర్కార్ అని మాట్లాడినా కే‌సి‌ఆర్ , ఒక్క విషయంలో హిందువులని తీవ్రంగా కించ పరిచాడు. హిందువులని పట్టుకొని హిందూ గాళ్ళు బొందు గాళ్ళు అనడంతో ఒక్కసారిగా హిందువులంతా తమ సత్తాని చూపించారు. టి‌ఆర్‌ఎస్ 9 సీట్లకే పరిమితం అవ్వడానికి కే‌సి‌ఆర్ బలుపు మాటలే కారణం అయ్యాయి. నిజామాబాద్ రైతుల ఆగ్రహం కూడా కారణం అయ్యింది.

 

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

బి‌జే‌పి MLA రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు

Share this on WhatsApp యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉండి ఎక్కువగా ప్రజల గుండెల్లో ఉన్న వాదనలని మరియు …