Tuesday , June 18 2019
Home / National / మమతాకి , హిందువులకి ఎందుకు పడటం లేదు

మమతాకి , హిందువులకి ఎందుకు పడటం లేదు

హిందువులకి మమతా బెనర్జీకి ఎందుకు పడదు. ఎందుకంటే ఈమెకి ముందు నుండి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడం అలవాటు. ముస్లింల. యొక్క ఓట్లని పొందడానికి హిందువులపై దౌర్జన్యంగా మాట్లాడటం, విపరీతంగా దాడులు చేయించడం చేసింది. ఇంకా చెప్పాలంటే బంగ్లాదేశ్ నుండి అక్రమంగా భారత్ లోకి ప్రవేశించిన బంగ్లా ముస్లింని ఆహ్వానించింది. ఓట్ల కోసం మరీ నీచంగా దిగజారి రాజకీయాలు చేసింది. హిందూ పండుగలపై ఆంక్షలు విధించింది. దుర్గ నవరాత్రి ఉత్సవాల ఊరేగింపులు చేయవద్దని చెప్పింది. కొన్ని ప్రాంతాల్లో హిందూ దేవి దేవాలయాలని కూల గొట్టించింది. ఇదే కాకుండా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయనివారిపై దాడులు చేయించేది. ఇవన్నీ చాలా మందికి తెలియని విషయాలు. ఇక బి‌జే‌పి కార్యకర్తలని తృణమూల్ కార్యకర్తలు చెప్పుల దండలు వేసి ఊరిగించ ఘటనలు కూడా ఉన్నాయి. అయితే ఈ మధ్యనే లోక్ సభ ఎన్నికల ముందు మమతా బెనర్జీ తీవ్ర ఆవేశంతో ఉంటూ ఎవరైనా జై శ్రీరామ్ అనే నినాదాలు చేస్తే పోలీసులు చేత అరెస్టు చేయించింది. ఒకసారి మమతా బెనర్జీ ఎన్నికల ప్రచార సభకి వెళ్తున్నప్పుడు గల్లీలో ఉండే చిన్న వయసు గల యువ కార్యకర్తలు జై శ్రీరామ్ అని నినాదాలు చేసినందుకు తన కాన్వాయ్ నుండి దిగి బెదిరించింది. ఇక లోక్ సభలో ఎన్నికల తర్వాత పశ్చిమ్ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ కి మెజారిటీ వచ్చిన నిష్ప్రయోజనమే అయింది. దేశవ్యాప్తంగా ఏ పార్టీ మద్దత్తు లేకుండానే బి‌జే‌పి తన సొంతంగా అధికారంలోకి వచ్చింది. అయితే అంతకు ముందు ఎన్నికల ప్రచారంలోనే దీదీ కి మోడీకి మాటల యుద్ధం ఎక్కువగా జరిగింది. ఓ సారి సభలో మోడీ మాట్లాడుతూ “ఫణి తుఫాన్  వచ్చిన సమయంలో మమతా బెనర్జీకి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదని, కనీసం ప్రజలకి ఆపద ఎదురు అయినా సమయంలో కూడా స్పందించలేదని, ఇలాంటి సమయంలో కూడా రాజకీయాలు చేయడం అవసరమా అని మోడీ గారు అన్నారు. అలాగే మమతా బెనర్జీకి అహంకారమని మోడీ గారు సభలో అన్నారు.

అయితే మమతా బెనర్జీ ఎక్కడికి వెళ్ళినా హిందువులు చుక్కలు చూపిస్తున్నారు. ఇక దీదీకి ఒక రకంగా చెప్పాలంటే కంటి మీద కునుకు కూడా లేకుండా అయిపోయింది. ఆమె ఎక్కడికి వెళ్ళినా జై శ్రీరామ్ నినాదాలతో గుండెల్లో దడ పెంచుతున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఎలెక్షన్ సమయంలో అయితే ప్రియాంక చోప్రా ఫోటోకి మమతా బెనర్జీ ఫోటోని మార్ఫ్ చేసి మమతా బెనర్జీకి చుక్కలు చూపించారు. తర్వాత మమతా వాళ్లపై కేసులు కూడా పెట్టింది. అయినా సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఆగలేదు. పెరిగిపోయింది. మమతా బెనర్జీకి అలా మనః శాంతి లేకుండా పోయింది. ఇంకా హిందువులు అంతటితో ఆగక మమతా బెనర్జీ వస్తుంటే జై శ్రీరామ్ అంటున్నారు. జై శ్రీరామ్ అన్నారని వారిపై అక్రమంగా కేసులు పెట్టించిన ఏకైక ఘనత గల ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. దీనికి నిరసనగా హిందువులు లక్ష పోస్ట్ కార్డ్ లని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కి పంపించారు. ఈ దెబ్బతో మమతా బెనర్జీకి మైండ్ భూచక్రంలా గిరున్న తిరిగింది.

మమతా బెనర్జీకి మోడీ నుండే ఈ లక్ష కార్డ్ లు వచ్చాయనే నేపం తోస్తూ టి‌ఎం‌సి కార్యకర్తలు ఇలా చేశారు. ప్రధాని కార్యాలయంకి టి‌ఎం‌సి కార్యకర్తలు 10,000 పోస్ట్ కార్డులు పంపించారు. అందులో జై హింద్ , జై బెంగాల్ , వందే మాతరం అని రాసి పంపారు. మమతా బెనర్జీ మాట్లాడుతూ “జై శ్రీరామ్ అనే నినాదం మతపరమైందని, అందుకే వ్యతిరేకిస్తున్నా అంటూ వ్యాఖ్యలు చేసింది. అలాగే అప్పట్లో మమతా బెనర్జీ సర్జికల్ స్ట్రైక్ సమయంలో కూడా భారత ఆర్మీని అవమానిస్తూ వ్యాఖ్యలు చేసింది. సర్జికల్ స్ట్రైక్ అబద్ధమని, నిజంగా జరిగితే ఆధారాలు చూపించండి వీడియో ని బయటపెట్టండి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

లవ్ జీహద్ పై అమ్మాయిలకు MP బండిసంజయ్ సూచనలు

Share this on WhatsApp మొన్న జరిగిన లవ్ జీహాద్ సంఘటన సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో చర్చనీయాంశం అయింది. …