Tuesday , May 21 2019
Home / International / పాకిస్థాన్ ముర్దాబాద్ అంటే డిస్కౌంట్ ఆఫర్

పాకిస్థాన్ ముర్దాబాద్ అంటే డిస్కౌంట్ ఆఫర్

పుల్వామా ఘటన తర్వాత భారత్ లో ఉన్న ప్రజలు బాధతో మరియు పాకిస్థాన్ పై కసితో ఉన్నారు. అయితే ఒక్కొక్కరు తమ దేశభక్తిని ఒక్కొక్క విధంగా చాటుకుంటున్నారు. ప్రస్తుతం ఛత్తీస్ ఘడ్ లోని జగ్దల్ పూర్ ప్రాంతంలో ఒక ఫుడ్ స్టాల్ బండి దగ్గర పాకిస్థాన్ ముర్దాబాద్ అంటే చికెన్ లెగ్ పీస్ 10 రూపాయలు డిస్కౌంట్ ఇస్తామని అంటున్నారు. ఈయన పేరు అంజన్ సింగ్ . ప్రజల హృదయాల నుండి ఈ దేశభక్తి రావాలని ఇలా చేస్తున్నాని అన్నారు. అతని బండి నడిచిన నడవకపోయిన ఏం ప్రాబ్లం కాదు. కానీ ఖచ్చితంగా దేశభక్తిని తెలుపాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. నిజంగా బండి కొట్టుతో వచ్చే డబ్బు కుటుంబాన్ని పోషించడానికే సరిపోదు, ఇలాంటి సమయంలో డిస్కౌంట్ పెట్టడం గ్రేట్. సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది.

ఇలాగే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చేస్తే బాగుండు అనేలా ఉంది. దేశంలో పెరుగుతున్న కొంత మంది దేశ ద్రోహుల కోసమైన ఇలాంటి పనులు చేయాలి. ఇంకొక చోట కూడా ఇలాగే 10 % డిస్కౌంట్ ఇస్తున్నారు. అలాగే ఒక చెప్పులు అమ్మే వ్యాపారి పాకిస్తాన్ ముర్దాబాద్ అని చెప్పి మూడు జతలు చెప్పులు 1100 కే అని అమ్ముతున్నారు. ఈ విధంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చేస్తే బాగుంటుంది. క్రింద వీడియోలు ఇస్తున్నాము. చూసిన తర్వాత ప్రతి భారతీయుడు తప్పకుండా షేర్ చేయగలరు.

పాకిస్థాన్ ముర్దాబాద్ అంటే చికెన్ లెగ్ పీస్ 10 రూపాయలు తగ్గింపు:-

కొత్త ముంబై లోని ఖర్ ఘర్ లో లక్కీ తవ రెస్టారెంట్ లో పాకిస్థాన్ ముర్దాబాద్ అంటే 10 % డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇతని పేరు సయ్యద్ ఖాన్ (లక్కీ తవ మాలిక్ ), ముస్లింలు పాకిస్థాన్ కి ఎప్పుడు సపోర్ట్ చేయరని, ముస్లింలు హిందూస్థాన్ (భారత్ ) వైపున ఉంటారని వీడియోలో చెప్తున్నారు. ఆ రెస్టారెంట్ లో పని చేసే వ్యక్తులు కూడా నినాదాలు చేస్తూ దేశభక్తిని ఈ విధంగా చాటుకుంటున్నారు. పాకిస్థాన్ ముర్దాబాద్, హిందూస్థాన్ జిందాబాద్ మరియు భారత్ మాతా కీ జై నినాదాలు చేస్తున్నారు.

ఈ వీడియోలో చెప్పులు అమ్మే వ్యక్తి , మూడు జతల చెప్పులు 1100 రూపాయలకి అని ఆఫర్ ఇస్తూ, పాకిస్థాన్ ముర్దాబాద్ అని నినాదాలు చేస్తున్నారు.క్రింద వీడియో ఇచ్చాము, చూడండి.

 

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

స్టేజ్ పైనే తెలంగాణ కాంగ్రెస్ నేతల ఫైట్

Share this on WhatsApp ఒక్కసారిగా కాంగ్రెస్ వీహెచ్ తాతయ్య అర్జున్ రెడ్డిలా మారిపోయాడు. వన వం వం వం …