Sunday , January 19 2020
Home / International / భారత్ కే వార్నింగ్ ఇస్తున్న పాకి ప్రధాని

భారత్ కే వార్నింగ్ ఇస్తున్న పాకి ప్రధాని

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఒక వైపు రెచ్చ గొడుతూ , ఇంకో వైపు చర్చలకి రమ్మని బదులు ఇస్తున్నాడు. ఇమ్రాన్ ఖాన్ మీడియా ముందు మాట్లాడుతూ “భారత్ ప్రభుత్వం ఎటువంటి ఆధారాలు లేకుండా పాకిస్థాన్ ని నిందిస్తోందని, ఒక వేళ భారత్ పాకిస్థాన్ పై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోనేది లేదని ప్రతి దాడులు చేస్తామని వార్నింగ్ లు” ఇస్తున్నాడు.

కానీ ఈ పుల్వామా దాడి చేసింది మేమేనని పాకిస్థాన్ లో ఉన్న జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఇంకా దరిద్రం ఏంటి అంటే అంతా డైరెక్ట్ గా ఉగ్రవాద సంస్థ ఒప్పుకున్న తర్వాత మన దేశంలో కూడా కొన్ని పార్టీలు ఈ విషయంపై దిగజారి మరి రాజకీయం చేయడం దారుణం. ఇంకా తమ పార్టీల కోసం 44 మంది జవాన్లపై జరిగిన దాడిని కూడా వాడుకుంటున్నారు.

అయితే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇంకా మాట్లాడుతూ “కాశ్మీర్ అంశంలో భారత్‌ను చర్చలకి స్వాగతిస్తున్నాం అంటూ దొంగ నాటకాలు ఆడుతున్నాడు. ఇంకా ఇమ్రాన్ ఖాన్ అవసరమైతే వచ్చి విచారణ చేసుకోవచ్చని నేను మీకు ఆఫర్ ఇస్తున్నా అని చెప్తున్నాడు.

ఇంతకు ముందు జరిగిన 26/11 ముంబై దాడుల విషయంలో మాస్టర్ మైండ్ హఫీజ్ సయీద్ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వాడు పాకిస్థాన్ లో ఇష్ట రాజ్యంగా తిరుగుతూ భారత్ కి వార్నింగ్ లు ఇస్తున్నాడు. హఫీజ్ సయీద్ ముంబై లో దాడి జరగడానికి ప్లాన్ గీసింది. వీడు ఇమ్రాన్ ఖాన్ ప్రధాని అవ్వక ముందు కూడా ఎన్నికలలో 30 మంది ఉగ్రవాదులని పోటీచేయించడానికి ఒక పార్టీ కూడా పెట్టాడు. ప్రపంచ వ్యాప్తంగా ఒత్తిడి వల్ల పాకిస్థాన్ ఎన్నికలలో పోటీ చేయకుండా చేసింది. అయిన వాడిని దున్నపోతుని మేపినట్టు మేపి భారత్ మీదకు దాడులు చేయించడానికి వదులుతున్నారు. ఇప్పటి వరకు హఫీజ్ సయీద్ ని గ్లోబల్ టెర్రరిస్టు గా ప్రకటించనివ్వకుండా పాకిస్థాన్ ,చైనాలు అడ్డుకుంటున్నాయి. ఇందులో చైనా పాకిస్థాన్ ఉగ్రవాదులకి మద్దత్తు తెలుప్తుంది. ఇప్పుడు జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకి సంబంధించిన ఉగ్రవాదులు పాకిస్థాన్ లో విచ్చలవిడిగా తిరుగుతున్నారు. వాళ్ళు భారత్ ఉన్న కాశ్మీర్ ముస్లింలని ఆ ఉగ్రవాద సంస్థలోకి చేరేలా చిన్ననాటి నుండి బ్రైన్ వాష్ చేస్తూ మతోన్మాద భావజాలంతో రెచ్చ గొట్టే ప్రసంగాలు చేస్తున్నారు.

ఇంకా ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ “పాకిస్థాన్ భూభాగాన్ని (అంటే కాశ్మీర్ ని కూడా పాకిస్థాన్ లో కలిపేశాడు) ఉపయోగించుకుంటుంటే, వారిని మా శత్రువుగానే చూస్తామని indirect గా వార్నింగ్ ఇస్తున్నాడు. “భారత్ లో అందరూ పాకిస్థాన్ ని నిందిస్తున్నారని అన్నాడు. సౌదీ ప్రిన్స్ పాకిస్థాన్ వస్తున్న సమయంలో ఇలాంటి దాడులు మేము ఎందుకు చేయిస్తామని, సౌదీ రాజు పర్యటన మాకు చాలా ముఖ్యం అని అంటున్నాడు. పాకిస్థాన్ స్థిరత్వం కోసం అడుగులు వేస్తున్న ఈ దశలో ఇలా దాడి ఎందుకు చేస్తామని” అన్నాడు.

ఇమ్రాన్ ఖాన్ ఇంకా మాట్లాడుతూ “పాకిస్తాన్‌కు ఈ దాడుల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నా, ఇది కొత్త పాకిస్తాన్, కొత్త ఆలోచనలతో ఉందని” , అలాగే భారత్ కి కూడా కొత్త ఆలోచన రావాలని పాకి ఇమ్రాన్ ఖాన్ అన్నాడు. యుద్ధం ప్రారంభించడం సులభమే, కానీ దాన్ని ఆపడం ఎవరి చేతుల్లో ఉండదని అని పాకి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నాడు. ఇంకా మాట్లాడుతూ “మేం వివేకంతో వ్యవహరిస్తాం, ఆఫ్ఘనిస్తాన్ తో వ్యవహరించినట్లే, చర్చల ద్వారా ఈ సమస్యని పరిష్కరించుకుంటామని అన్నాడు.

ఇమ్రాన్ ఖాన్ గాడు వివేకం అని మాట్లాడే ముందు పాకిస్థాన్ లో ఉన్న ఉగ్రవాద సంస్థలని ఎరిపారేయాలి కానీ అలా చేయరు,ఎందుకంటే  పాకిస్థాన్ కి కాశ్మీర్ కావాలి, ఉగ్రవాదులు ఉంటే కాశ్మీర్ ని ఆక్రమించుకోవడానికి కాశ్మీర్ లో ఉన్న ముస్లింలని రెచ్చగొట్టి భారత్ మీదకే వదులుతుంది. ఎన్నో సంవత్సరాలుగా పాకిస్థాన్ ఎన్నో ఉగ్రవాద సంస్థలకి అండగా ఉంటూ డబ్బులు, ఆయుధాలు సమకూరుస్తుంది. భారత్ లో జరిగిన ప్రతి ఉగ్రదాడిలో పాకిస్థాన్ హస్తం ఉంది.

Watch this video:-

 

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

దళిత యువతి లవ్ జీహాద్ కి గురి-రఫీక్ మోసం

Share this on WhatsApp హైదరాబాద్ కి చెందిన ముస్లిం యువకుడు రఫీక్ , వరంగల్ కి చెందిన దళిత్ …