Tuesday , June 18 2019
Home / National / ధోనిని భారత్ ని అవమానిస్తున్న పాక్ మంత్రి

ధోనిని భారత్ ని అవమానిస్తున్న పాక్ మంత్రి

మొన్న జరిగిన ప్రపంచ కప్ తొలి మ్యాచ్ లో మహేంద్ర సింగ్ ధోని భారత పారా మిలటరీకి సంబంధించిన బలిదాన్ సింబల్ తో ఉన్న గ్లౌవ్స్ లని ధరించారు. భారత పారా మిలటరీ గౌరవార్థం ఈ బలిదాన్ సింబల్ తో ఉన్న గ్లౌవ్స్ లని ధోని ధరించారు. ఈ ధోని ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది. ధోనిని ప్రశంసిస్తూ భారతీయులు ఫోటోకి భారత్ మాతాకీ జై , జై హిందూ అంటూ ట్రెండ్ చేస్తున్నారు. ఇంతకు ముందు భారత్ 2011 లో 28 సంవత్సరాల తర్వాత ప్రపంచ కప్ ధోని క్యాప్టెన్సీ సారధ్యంలో గెలిచింది. ధోని అందించిన విజయానికి గాను భారత్ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ హోదాతో గౌరవించింది. ఆ తర్వాత ధోని ఆగ్రాలో పారా మిలటరీతో కలిసి శిక్షణ కూడా తీసుకున్నారు. అక్కడ ధోనీ ఏకంగా ఐదుసార్లు పారాచ్యూట్ జంప్‌ చేశారు. భారత్ ఆర్మీ అంటే తనకి ఎంతో ఇష్టమని చాలా సార్లు తెలిపాడు. పుల్వామా ఉగ్రదాడి సమయంలో కూడా ఆస్ట్రేలియాతో ఆడిన మ్యాచ్ లో ఆటగాళ్ళందరికి మిలటరీ క్యాప్ లను ఇచ్చాడు. ఈ ప్రపంచ కప్ తర్వాత క్రికెట్ కి ధోని రిటైర్మెంట్ ప్రకటించి భారత్ ఆర్మీతో కలిసి పనిచేసే అవకాశం ఉంది. 3 నెలల క్రితం ఫిబ్రవరిలో న్యూజిలాండ్ తో ఆడిన టి-20 మ్యాచ్ లో ధోని అందరి చేత హ్యాట్స్ ఆఫ్ అనిపించుకునేలా చేశాడు. ధోని అభిమాని జాతీయ జెండా తీసుకొని ధోనిని చేరుకున్నాడు. కానీ ధోనిని చూసిన ఆనందంలో జాతీయ జెండాని వదిలేసి, తన షర్ట్ తో ధోని షూస్ తుడిచాడు. వెంటనే జాతీయ జెండాని ధోని చేతితో పట్టుకొని తన దేశభక్తిని చాటుకున్నాడు.

అసలు విషయం గురించి తెలుసుకుందాం. ధోని బలిదాన్ సింబల్ గ్లౌవ్స్ పారా మిలటరీ గౌరవార్థం ధరించినందుకు దేశవ్యాప్తంగా అభినందిస్తున్నారు. కానీ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ బోర్డ్ (ICC ) వెంటనే ధోని గ్లౌవ్స్ లపై బలిదాన్ సింబల్ తీసేయాలని భారత్ క్రికెట్ కౌన్సిల్ బోర్డ్ ని సూచించింది. అలాగే పాకిస్థాన్ మంత్రి గాడు ఫావద్ హుస్సైన్ ధోనిని అవమానిస్తూ ఇంగ్లాండ్ లో జరిగిన మ్యాచ్ లో బలిదాన్ సింబల్ పెట్టుకున్నందుకు ఇలా అంటున్నాడు. ఫావద్ హుస్సైన్ ట్విటర్ అక్కౌంట్ లో ధోని నువ్వు ఇంగ్లాండ్ లో ఉన్నది క్రికెట్ కోసం,  భారత్ మాత కోసం కాదని అన్నాడు. ఈ పాకిస్థాన్ ఎన్ని సార్లు బుద్ధి చెప్పినా మారదు.

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

లవ్ జీహద్ పై అమ్మాయిలకు MP బండిసంజయ్ సూచనలు

Share this on WhatsApp మొన్న జరిగిన లవ్ జీహాద్ సంఘటన సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో చర్చనీయాంశం అయింది. …