Monday , March 18 2019
Home / National / భారత జవాన్లని అవమానిస్తున్న నవజోత్ సింగ్

భారత జవాన్లని అవమానిస్తున్న నవజోత్ సింగ్

కాంగ్రెస్ పార్టీ నుండి ఒకరి తర్వాత ఒకరు మన భారత జవాన్లని అవమానిస్తూ మరియు వారి యొక్క వీరపోరాటాలని అవమానిస్తూ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నాయకుడు పంజాబ్ మంత్రి నవజ్యోత్ జింగ్ మన భారత వైమానిక దళాన్ని అవమానిస్తూ దారుణంగా వివాదాస్పద వ్యాఖ్యాలు చేశాడు. ఈయన మాట్లాడిన మాటలు భారత ప్రజల రక్తం మరిగిపోయేలా ఉన్నాయి. నవజ్యోత్ సింగ్ మాట్లాడుతూ “జైష్ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ పై భారత్ ఎయిర్ ఫోర్స్ చేసిన దాడి ఎలెక్షన్స్ స్టంట్ ” అని దిగజారుడు మాటలు మాట్లాడుతూ నీచ రాజకీయం చేస్తున్నాడు. ఇంతకు ముందు పాకిస్తాన్ లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ కి, పాకిస్థాన్ కి మద్దత్తు చేసి దేశ వ్యాప్తంగా వివాదంలో ఉన్న విషయం తెలిసిందే. ఇంకా కొన్ని వ్యాఖ్యలు చేస్తూ దేశ ప్రజల మనోభావాలు దెబ్బతిస్తున్నాడు.

బాలకోట్ లో జైష్ మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం చేసిన సర్జికల్ స్ట్రైక్ దాడుల కి సంబంధించి ఆధారాలు చూపించమని అడుగుతున్నాడు. ఒక్క ఫోటో కూడా బయట ఎందుకు పెట్టడం లేదని భారత వైమానిక దళాన్ని తీవ్రంగా అవమానిస్తున్నాడు. నిజంగా భారత వైమానిక సర్జికల్ దాడులు చేస్తే సాక్ష్యా ఆధారాలు చూపించమని వ్యాఖ్యలు చేస్తున్నాడు. భారత ఎయిర్ ఫోర్స్ ఉగ్రవాదులని మట్టుబెట్టడానికి వెళ్ళారా లేక చెట్లని పీకడానికి వెళ్ళారా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ అవమానించాడు.

ఇప్పటికే కాంగ్రెస్ లో దిగ్విజయ్ సింగ్ “పుల్వామాలో జరిగిన ఉగ్రవాద దాడిని ‘ఒక ప్రమాదం’ అని చెప్తున్నాడు. అది ఉగ్రవాద దాడి కాదని అంటున్నాడు. అసలు అర్థం కాదు వీళ్ళు జైష్ ఉగ్రవాద సంస్థకి మదత్తు తెలుప్తున్నారా లేక పాకిస్థాన్ కి మద్దత్తు తెలుప్తున్నారా లేక వీళ్ళ రాజకీయాల కోసం భారత జవాన్ల వీర పోరాటాలని కూడా అవమానిస్తున్నారా? , మరీ ఇంత దిగజారుడుతనమా ?

నిన్న భారత IAF చీఫ్ గారు మాట్లాడుతూ “ఉగ్రవాద స్థావరాలని లక్షంగా చేసుకొని పేల్చడం మా పని, ఉగ్రవాదులని చంపడం మా పని, కానీ ఎంత మంది చనిపోయారని కనుక్కోవడం మా పని కాదని చెప్పారు. అలాగే బాలాకోట్ లో భారత ఎయిర్ ఫోర్స్ సర్జికల్ దాడులు జరుగుతున్న సమయంలో 300 మంది ఉగ్రవాదులు చాలా బిజీ కాల్స్ చేసుకున్నాయని NTRO (నేషనల్ టెక్నికల్ రిసర్చ్ ఆర్గనైజేషన్ ) సంస్థ తెలిపింది. దాడి జరిగిన తర్వాత అన్నీ ఆగిపోయాయని అన్నారు. బాలాకోట్ లో ఎయిర్ ఫోర్స్ శిబిరాలపై దాడులు జరిగినట్టు జైష్ ఉగ్రవాద సంస్థ వాళ్ళు కూడా మైక్ లో ప్రకటించారు.

 

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

ఇవి తింటే మీ పిల్లలు త్వరగా చస్తారు-చూడండి

Share this on WhatsApp పిల్లలే ప్రాణం అని బతికే భారతీయులం మనం. మన పిల్లలకి చిన్న దెబ్బ తగిలితేనే …