Wednesday , April 24 2019
Home / National / తన ప్రసంగంతో అదరగొట్టిన మోడీ -2019 గుంటూర్

తన ప్రసంగంతో అదరగొట్టిన మోడీ -2019 గుంటూర్

ఈ రోజు మోడీ గారు గుంటూర్ లో జరిగిన సభలో మాట్లాడారు. చంద్రబాబు పై మరియు లోకేశ్ పై ఫన్నీ సెటైర్స్ వేశారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ కి చేసిన వాటి గురించి మరియు ఇచ్చిన వాటి గురించి మాట్లాడారు.

మోడీ గారు మాట్లాడుతూ “చంద్రబాబు మోడీ గారు చేసే పనుల గురించి మరియు ఇచ్చిన నిధుల గురించి చెప్పకుండా, అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడని అన్నారు. ఇంకా మహా కూటమితో కలిసి నన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రూపు రేఖలు మరుస్తానని, తానే మారిపోయాడని, అలాగే తన పార్టీ కోసం, తన కొడుకు కోసం మాత్రమే పనిచేస్తున్నాడని, చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమి చేయడం లేదని చెప్పారు. చంద్రబాబు U-Turn ముఖ్యమంత్రిగా మారిపోయాడని అన్నారు.

ఇంకా ప్రధాని మోడీ గారు మాట్లాడుతూ “చంద్రబాబు కేంద్ర పథకాలకీ స్టిక్కర్ లు అంటించుకుంటున్నాడని, అసలు ఆ పథకాలు చంద్రబాబువి కావు అని అన్నారు. చంద్రబాబు ఎప్పుడు నేను సీనియర్ అని చెప్పుకుంటాడు కానీ చేసిన పనుల గురించి చెప్పుకోడని అన్నారు. చంద్రబాబుని  సీనియర్ గా తాను ఎప్పుడు గౌరవం ఇచ్చానని మోడీ అన్నారు.

ఇంకా మోడీ గారు చంద్రబాబుని ఉద్దేశించి మాట్లాడుతూ “మీరు సీనియర్ పార్టీలు మార్చడంలో, మీరు సీనియర్ కొత్త కొత్త కూటమిలతో పొత్తు పెట్టుకోవడంలో, మీరు సీనియర్ మామని వెన్నుపోటు పొడవడంలో, మీరు సీనియర్ ఎన్నిక తర్వాత ఎన్నికలో ఓడిపోవడంలో నేను ఇందులో మీతో పోటీకి రాలేను, మీరు సీనియర్ ఈ రోజు ఎవరిని అయితే తిడతారో మళ్ళీ వాళ్ళ ఒడిలోనే వెళ్ళి కూర్చోవడంలో , మీరు సీనియర్ ఆంధ్రప్రదేశ్ కలలని నీరు కార్చడంలో , ఇన్ని రకాలుగా సీనియర్ మీతో ఎందులో నేను పోటీకి రాలేను అని మోడీ గారు అన్నారు.

మోడి గారు మాట్లాడుతూ “NTR గారి కలలని సాకారం చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిమగ్నులు అవ్వాలని చెప్పారు. NTR గారిని అవమానించిన కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారని ప్రశ్నించారు. అలాగే ఎన్‌టి‌ఆర్ గారు కాంగ్రెస్ లేని భారతదేశాన్ని కోరుకున్నారని అన్నారు. ఆ రోజుల్లో NTR గారు కాంగ్రెస్ ని దుష్ట కాంగ్రెస్ అని తిట్టారని, అలాంటి కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు కలిశారని అన్నారు. ఇలాంటి పనులు వల్ల NTR గారి ఆత్మ ఎంత క్షోభిస్తుందోనని చెప్పారు. అలాగే  లోకేశ్ తండ్రి (చంద్రబాబు) నిజాలు, వాస్తవాలు చెప్పకుండా అసలు ఎందుకు తప్పించుకుంటున్నారో ఆంధ్ర ప్రజలకి చెప్పడానికి వచ్చానని కారణాలు చెప్పారు.

  1. మొదటి కారణం ఎన్నిక తర్వాత ఎన్నిక గెలిచింది లేదు, కాబట్టి ఇప్పుడు ఎన్నికలలో ఓడిపోతామనే భయం అని.
  2. రెండవ కారణం తన కొడుకుని రాజకీయాలపై బలవంతంగా రుద్దడానికి అని ,
  3. వేల కోట్లు ఎలా సంపాదించాడన్న కారణం
  4. నాలుగవ కారణం అవినీతి లేకుండా పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారు అంటే భయం అని అన్నారు.

మోడీ గారు ఇంకా మాట్లాడుతూ ” చంద్రబాబుని లెక్కలు అడిగితే తప్పించుకు తిరుగుతున్నాడని, లెక్కలు చెప్పడం లేదని, ఇప్పటి వరకు లెక్కలు చెప్పే అలవాటు అసలు ఈయనకు లేనట్టుందని చెప్పారు. మధ్యలో మోడీ గారు కన్నా లక్ష్మీ నారాయణ గారిని సభకి ఎవరు ఖర్చు చేశారని అడిగినప్పుడు, ఇదంతా బి‌జే‌పి పార్టీ కార్యకర్తలు పెట్టుకున్నారని జవాబు ఇచ్చారు. అదే చంద్రబాబు అయితే ఢీల్లిలో ఫోటోలు తీయించుకోవడానికి వెళ్లరాని, అలా వెళ్లడానికి ఈయన ప్రజల యొక్క కోట్ల డబ్బులు ఖర్చు పెడుతున్నారని అన్నారు. అలాగే నా మీద తిట్ల వర్షం కురిపించడం ఆపి, ఏం ఖర్చు చేశారో లెక్కలు చెప్పండని అన్నారు.

మోడీ గారు తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు go back అని నినాదాలు చేస్తున్నారో వాళ్ళతో చెప్పారు. నేను ఇప్పుడు మళ్ళీ ఢీల్లి వెళ్లబోతున్నాను. అక్కడే అధికారంలోకి రాబోతున్నానని అన్నారు. మన దేశంలో ఎంతో మంది కష్టపడే వాళ్ళు ఉన్నారు, అలాంటి వారి కోసం మనం కృషి చేయాలి గాని మన కొడుకులకోసం కాదని అన్నారు. చంద్రబాబు ఏవో తప్పుడు పనులు చేశాడు కాబట్టే వాటిని కప్పి పుచ్చుకోవడానికి అసత్యాలు, అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఇచ్చిన కమిటిమెంట్ విషయంలో మేము కరెక్ట్ గానే ఉన్నాము కానీ చంద్రబాబు కరెక్ట్ గా లేడని చెప్పారు.

మోడీ గారు మాట్లాడుతూ “2014 లో స్పెషల్ స్టేటస్ తో ఎన్ని డబ్బులు వస్తాయో అన్నీ డబ్బులు లెక్క వేసుకొని ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చామని అన్నారు. ఇంకా స్పెషల్ పాకేజ్ తో పాటు ఎక్కువే డబ్బులు ఇచ్చామని చెప్పారు. 2016 లో స్పెషల్ పాకేజ్ ని ఇచ్చినందుకు అసెంబ్లీలో  మెచ్చుకుంటూ చంద్రబాబు ప్రసంగం చేశారని చెప్పారు. 3 లక్షల కోట్లు కంటే ఎక్కువ ప్రాజెక్టు లు కేంద్రం ఇచ్చిందని అన్నారు. కానీ తర్వాత కేంద్రం లెక్కలు అడిగినందుకు చంద్రబాబు యూ-టర్న్ తీసుకున్నారని అన్నారు. అయినా కూడా కేంద్రం ఆంధ్రప్రదేశ్ కి IIT తిరుపతి, మంగళగిరి AIMS, అనంతపూర్ సెంట్రల్ యునివర్సిటి ఇచ్చింది. మూడు విమానాశ్రయాల విస్తారణ, మెట్రో ప్రాజెక్టు లు, పోలవరం ప్రాజెక్టు చేస్తుందని అన్నారు. అలాగే మ్యాన్ ఫ్యాక్చరింగ్ హబ్ , లాజిస్టిక్ పార్క్ లు , అమరావతికి నిధులు ఇచ్చినట్లు తెలిపారు.

PM Modi funny satires on AP CM Chandrababu:-

Narendra Modi Powerful Speech in Guntur 2019:-

Narendra Modi attends a Public Meeting in Guntur, Andhra Pradesh. BJP meeting gets a huge public response. PM Narendra Modi made funny satires and real facts on Chandrababu and Lokesh.

PM Narendra Modi Said, Chandrababu alliances with TDP now. Actually, the TDP Party was established by NTR for Anti-Congress.

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

ఇవి తింటే మీ పిల్లలు త్వరగా చస్తారు-చూడండి

Share this on WhatsApp పిల్లలే ప్రాణం అని బతికే భారతీయులం మనం. మన పిల్లలకి చిన్న దెబ్బ తగిలితేనే …