Tuesday , May 21 2019
Home / Entertainment / నాస్తికుడిగా మారి ప్రశ్నిస్తున్న నాగబాబు

నాస్తికుడిగా మారి ప్రశ్నిస్తున్న నాగబాబు

సమాజంలో రోజు రోజుకు నాస్తికవాదులు మరియు నాస్తికవాదం పెరిగేలా కొందరు సెలెబ్రటీలు మరియు మీడియా ప్రయత్నిస్తున్నారు. మీడియాలో ఎక్కువగా ఒక వర్గాన్ని గాని ఒక మతాన్ని గాన్ని టార్గెట్ చేస్తూ రెచ్చగొట్టేలా డిబేట్ లు చేస్తున్నారు. హిందూ మతం గాని, ఇస్లాంలో గాని , క్రిస్టియానిటీలో గాని కొంత మంది వ్యాఖ్యానాల వల్ల మత విద్వేషాలు, హింస పెరుగుతున్నాయని అన్నాడు. నాగబాబు మాట్లాడుతూ “దేవుడికి ఎవరు భయపడరని, వాళ్ళ స్వార్థం కోసమే దేవున్ని పూజిస్తారని, ప్రపంచంలో లా అండ్ ఆర్డర్ కి మాత్రమే భయపడుతారని.” మతాలు భూమిపై అంతరించాలని , అంతరిస్తేనే భూమి శాంతితో ఉంటుంది అని అన్నాడు. ఒక ఉదాహరణ గురించి మాట్లాడుతూ “ఒకవేళ లా అండ్ ఆర్డర్ ఏదైనా ఒక రోజు తీస్తేస్తామని ప్రభుత్వం చెపితే భూమిపైన పవిత్రమైన మనిషి కూడా ఇద్దరు, ముగ్గురిని నరికేస్తాడని అన్నారు. దేవుడికి మనుషులు భయపడితే రెండు ప్రపంచ యుద్ధాలు ఎందుకు జరుగుతాయి అని ప్రశ్నించాడు.

నాగబాబు మాట్లాడుతూ “స్వర్గం, నరకం అనేవి లేవని, అవన్నీ అభూతకల్పన అని అన్నాడు. మగవాళ్ళు పుణ్యం చేస్తే స్వర్గంకి వెళ్ళి రంభ, ఊర్వశి, మేనకలు ఉంటారు. మరి ఆడవాళ్ళు పుణ్యం చేస్తే వాళ్ళకి ఎలాంటి స్వర్గం ఉంటుందని అన్నాడు. మీ భార్య కూడా పూజలు చేస్తుంది కదా మరి ఆమె ఎక్కడికి వెళ్తుందని ప్రశ్నించాడు. అలాగే వాళ్ళు ఎవరితో ఎంజాయ్ చేస్తారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. స్వర్గం అనేది ఒక అభూతకల్పన అని, అది జనాల చేత మంచి పనులు చేయించడానికే అని అన్నాడు. స్వర్గం అనేది మనం రాసుకున్న విషయం అని, ఇవి ప్రజల నోరు ఊరించడానికి మతాలు పెట్టుకున్న అంశం అని అన్నాడు.

Watch and Share It:-

 

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

అసలు దయ్యాలు ఉన్నాయా ? – గరికపాటి అభిప్రాయం

Share this on WhatsApp మన తెలుగు రాష్ట్రాల్లో అద్బుతమైన ప్రవచన కర్తలలో గరికపాటి నరసింహరావు గారు ఒకరు. నరసింహరావు …