Tuesday , June 18 2019
Home / National / లవ్ జీహద్ పై అమ్మాయిలకు MP బండిసంజయ్ సూచనలు

లవ్ జీహద్ పై అమ్మాయిలకు MP బండిసంజయ్ సూచనలు

మొన్న జరిగిన లవ్ జీహాద్ సంఘటన సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో చర్చనీయాంశం అయింది. లవ్ జీహాద్ పేరుతో హిందూ అమ్మాయిలని ప్రేమించి మోసం చేస్తూ ఇతర దేశాలకు అమ్మేస్తున్నారని ఇంతకు ముందు హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి  . రిజ్వన్ అనే ముస్లిం యువకుడు ఇందిరా అనే హిందూ అమ్మాయిని బ్రైన్ వాష్ చేసి జూనైరాగా మార్చాడని తల్లి తండ్రులు చెప్తున్నారు. ఆమెకి ముస్లింగా మారినట్లు Islam Acceptance అనే కార్డ్ కూడా తెచ్చ్చుకున్నారు. కానీ ఆమెని సిరియాకి గాని దుబాయికి గాని అమ్మేస్తున్నట్లు ఇందిరా అమ్మ కొట్టే రేణుక చెప్తున్నారు. కొట్టే రేణుక మీడియా ముందు మాట్లాడుతూ ఇందిరా తన చెల్లే సింధుకి ఆపదలో ఉన్నట్లుగా తనని సిరియా గాని, దుబాయికి గాని అమ్మేస్తునట్లు మెసేజ్ చేసినట్టుగా చెప్తున్నారు. పోలీసులకి తమ బాధని వ్యక్తం చేసిన పట్టించుకోవడం లేదని అన్నారు. ఒకవేళ కనుక తమ కూతురు ఇందిరా తమ దగ్గరికి రాకపోతే ఆత్మహత్య చేసుకుంటామని తల్లి రేణుక తండ్రి మహేశ్ చెప్తున్నారు.

అయితే ఇదే విషయాన్నే ఉద్దేశించి MP బండి సంజయ్ గారు మాట్లాడుతూ “ఈ మధ్య లవ్ జీహద్ పేరుతో అమ్మాయిలని ట్రాప్ చేసి మతం మారుస్తున్నారని, అలాగే ఇంకొంత మంది ఉగ్రవాద దేశాలకి అమ్మేస్తున్నారని అన్నారు. ఇలాంటి సంఘటనలు దేశవ్యాప్తంగా చాలా చోట్ల జరిగాయని అన్నారు. బండి సంజయ్ గారు ఆడపిల్లలని ఉద్దేశించి మాట్లాడుతూ “దయచేసి ఆడపిల్లలు పెంచిన తల్లి తండ్రులని మోసం చేయకండి. వారు మీ కోసమే ఎంతో కష్టపడి మీ యొక్క మంచి భవిష్యత్ కోసం కృషి చేస్తున్నారని చెప్పారు. ఎవరి మాయ మాటలు నమ్మి లవ్ జీహద్ కి బలి కాకండి అని చెప్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న సంఘటనల గురించి తెలుసుకొని జాగ్రత్త పడవలసిందిగా చెప్పారు. ఇలాంటి లవ్ జీహద్ లాంటి వ్యవహారాలపై చట్ట పరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

బి‌జే‌పి MLA రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు

Share this on WhatsApp యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉండి ఎక్కువగా ప్రజల గుండెల్లో ఉన్న వాదనలని మరియు …