Saturday , February 23 2019
Home / National / ప్రపంచానికి సెల్ ఫోన్ నేనే తెచ్చాను అంటాడు

ప్రపంచానికి సెల్ ఫోన్ నేనే తెచ్చాను అంటాడు

లక్ష్మీ పార్వతి ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ “నేను ఎప్పుడు చంద్రబాబుని వ్యక్తి గత విమర్శలు చేయలేదని” చెప్పారు. అలాగే “నేను ఒక సీనియారిటీ ఉన్న వ్యక్తిగా మరియు అతని పరిపాలన గమనిస్తున్న” దానిగా మాత్రమే విమర్శ చేస్తున్నానని అన్నారు. ఇంకా ఆమె మాట్లాడుతూ “చంద్రబాబు పరిపాలన ఎప్పుడు 100 % ఫైల్ అవుతూ వస్తుంది. ఇక్కడ 9 ఏళ్ళు చంద్రబాబు పరిపాలించినప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలన్ని మూతపడ్డాయి. అదే విధంగా 3000 కోట్ల అప్పు ఉన్న రాష్టాన్ని 30,000 కోట్ల అప్పున్న రాష్ట్రంగా మార్చేశాడు. ముంచేశాడు. ప్రపంచ బ్యాంక్ తో ఒప్పందం చేసుకొని అప్పులు తీసుకచ్చి ఆంధ్రప్రదేశ్ ని ఋణ ఆంధ్రప్రదేశ్ గా మార్చేసాడు. ఒక్క పరిశ్రమ రాలేదు. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ , విమానశ్రయం గురించి గొప్పలు చెప్పుకుంటున్నాడు. కానీ ఇవన్నీ వైయస్ రాజశేఖర్ రెడ్డి కాలంలోనే మొత్తం పనులు జరిగాయి. చంద్రబాబు చేసింది ఏం లేదు.

ఇంకా లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ “చంద్రబాబు ఒక్క హైటెక్ సిటి మాత్రమే కట్టాడు. కానీ హైటెక్ సిటి కట్టక ముందే రాజీవ్ గాంధీ కాలం లోనే  IT ప్రారంభం అయింది. నెదురుమల్లి జనార్ధన్ కాలంలోనే IT సంస్థ ప్రారంభం అయింది. హైటెక్ సిటి కూడా తన స్వలాభం కోసమే, అక్కడ భూములన్నీ తక్కువ ధరలకి కొని తన వాళ్ళందరికీ ఇచ్చాడు. ఒకే ఒక్క బిల్డింగ్ కట్టాడు.  కానీ ఈ రోజు “ప్రపంచానికి సెల్ ఫోన్ నేనే తెచ్చాను అంటాడు, IT నేనే తెచ్చాను అంటాడు. హైదరాబాద్ ని నేనే అభివృద్ధి చేశాను అంతకు ముందు కాలేదు” అంటాడు. బయట వాళ్ళు ఎవరైనా “చంద్రబాబు నాయుడు వల్లే హైదరాబాద్ ఇంత అభివృద్ధి చెందింది అని అంటున్నారా?”, ఇతనికి ఇతనే పొగుడు కుంటాడు.

ఆమె ఇంకా మాట్లాడుతూ “IT అనేది ఒక ఆంధ్రప్రదేశ్ కి సంబంధించింది కాదు. భారతదేశ వ్యాప్తంగా చూడాలి. ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన మార్పుల్లో ఇది ఒకటి. అప్పుడే  ప్రపంచ వ్యాప్తంగా ఐ‌టి పుంజుకుంటున్న సమయంలో, రాజీవ్ గాంధీ విదేశాల్లో చదువుకోవడం వల్ల భారత్ లో ఐ‌టిని ప్రోత్సహించారని అన్నారు.  కర్నాటక, తమిళ్ నాడు, గుజరాత్ , ఢీల్లి మరియు మిగతా కొన్ని రాష్ట్రాల్లో ఐ‌టి ని అప్పటి నుండే రాజీవ్ గాంధీ ప్రోత్సహించారని చెప్పారు. రాజీవ్ గాంధీ ఐ‌టి రంగానికి హైదరాబాద్ లో శంకు స్థాపన చేశారని అన్నారు. ఆ సమయంలో చంద్రబాబు కనీసం MLA కూడా కాదు.  అప్పుడు పార్టీ సెక్రేట్రీ గా ఉన్నాడని చెప్పారు.

లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ “1994 elections లో నేను లేకుండా టి‌డి‌పి గెలిచేదా?, అంత అనారోగ్యం తో ఉన్న ఎన్‌టి‌ఆర్ గారు లేచేవారా ?, ఆ సమయంలో ‘నేను,ఎన్‌టి‌ఆర్ గారు ప్రచారానికి వెళ్ళాం, ఎవరు రాలేదు, ప్రచారం చేస్తూ ప్రసంగాలు చేసింది నేను, ఓటర్ లని ప్రభావితం చేసింది నేను, నిజానికి కావాలని అనుకుంటే మంత్రిని కావచ్చు, అంతగా కృషి చేశాను. ఆ సమయంలో టి‌డి‌పి పార్టీ అంత స్థాయిలో గెలిచిందంటే కారణం నేను కాదా. అలాంటి నన్ను విమర్శించే హక్కు మీకుందా. మీకు ఆ సమయంలో నచ్చకపోతే వేరే పార్టీ పెట్టుకోవాలి లేదంటే పార్టీలో అణిగి మణిగి ఉండాలి కానీ కుట్ర చేసి ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్ వాళ్ళతో కుమ్మక్కయ్యారు. అలాగే ఎన్‌టి‌ఆర్ ప్రధానిగా అవ్వకూడదని కేంద్రంలో కాంగ్రెస్ భావించింది, చంద్రబాబు మోసం చేసి పార్టీ లాక్కున్నాడని అన్నారు.

Watch It:-

కె ఏ పాల్ ని గట్టిగా తగులుకున్న రామ్ గోపాల్ వర్మ & లక్మీ పార్వతి మూవీ డీటైల్స్ Watch It:

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

మీ జవాన్ల శవపేటికలు కొనసాగుతాయి – పాకి పంది

Share this on WhatsApp పుల్వామాలో జరిగిన దాడిలో 44 మంది జవాన్లు చనిపోయిన తర్వాత దేశంలో ఒక్కసారిగా విషాద …