Tuesday , May 21 2019
Home / Politics / CBN కంప్యూటర్ కనిపెట్టింది నేనే అంటాడు-KTR

CBN కంప్యూటర్ కనిపెట్టింది నేనే అంటాడు-KTR

కే‌టి‌ఆర్ ప్రెస్ మీట్ లో చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. కే‌టి‌ఆర్ మాట్లాడుతూ “చంద్రబాబుకి, లోకేశ్ కి ఒక అలవాటు బాగా ఉందని అది ఏంటంటే అడ్డంగా దొరికిపోవడం, అలా దొరికిపోయాక మిద్దెలెక్కి అరవడం, బుకాయించడం. వోట్ కి నోట్ కేసులో చంద్రబాబు బ్రీఫీడ్ మీ అని దొరికిపోయాడని, అలా దొరికాక కూడా నిజం ఒప్పుకోకుండా చంద్రబాబు ఎప్పుడు మా ఫోన్ లు టాప్ చేస్తున్నారని అంటాడని అన్నారు. ఏనాడు కూడా నేను ఆ పని చేయలేదని చంద్రబాబు చెప్పలేదని ప్రెస్ మీట్ లో మాట్లాడారు.

ఇంకా కే‌టి‌ఆర్ మాట్లాడుతూ “తెలంగాణ పోలీసులు, తెలంగాణ అధికార వ్యవస్థ ఒక IT గ్రిడ్ అనే కంపెనీ మీద దాడి చేస్తున్నారని చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నాడని అన్నారు. అయితే అసలు విషయం ఏంటంటే “లోకేశ్వర్ రెడ్డి అనే ఆంధ్ర వ్యక్తి గతంలో అతను ఆంధ్రలోని ఒక IT కంపెనీలో పనిచేశాడని, ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నాడని, ఈ లోకేశ్వర్ రెడ్డి యొక్క వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వ వెబ్ సైట్ నుండి IT గ్రిడ్ అనే కంపెనీ దొంగలించి తెలుగు దేశం పార్టీకి సమాచారాన్ని ఇచ్చారని చెప్పారు. అందుకారణంగా లోకేశ్వర్ రెడ్డి  IT గ్రిడ్ అనే కంపెనీ పై తెలంగాణ హైదరాబాద్ పోలీసులకి కంప్లెంట్ ఇచ్చారని అన్నారు. అయితే  ఈ IT గ్రిడ్ అనే కంపెనీ “ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రభుత్వ వెబ్ సైట్ లలోని సమాచారాన్ని, ప్రజల యొక్క రహస్య సమాచారాన్ని దొంగలిస్తున్నారని, అలా దొంగలించిన సమాచారాన్ని తెలుగు దేశం పార్టీకి అందిస్తున్నారని చెప్పారు. సెక్షన్ 66 , 72 కింద చట్టాన్ని ఉల్లంఘించి సమాచారాన్ని దొంగాలిస్తున్నారని చెప్పారు. ఈ కంపెనీ పై హైదరాబాద్ లో కేసు వేశారని అందుకారణంగా తెలంగాణ పోలీసులు స్పందిస్తే, ఆంధ్ర పోలీసులు ఇక్కడికి వచ్చి ఆ లోకేశ్వర్ రెడ్డిపై దాడి చేయడానికి ప్రయత్నించారని, అలాగే దుర్భాషలు ఆడారని అన్నారు. IT గ్రిడ్ అనే కంపెనీపై తెలంగాణ పోలీసులు చర్యలు తీసుకుంటే చంద్రబాబుకి ఎందుకు భయం అని, ఏ తప్పు చేయకపోతే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని అన్నారు. IT గ్రిడ్ కంపెనీ సెక్షన్ 66 , సెక్షన్ 72 లని ఉల్లంగించి సమాచారాన్ని దొంగాలిస్తున్నారని, అలా దొంగలించిన సమాచారాన్ని టి‌డి‌పికి అందిస్తున్నారని చెప్పారు. సేవ మిత్రా వేదా app ద్వారా టి‌డి‌పి పార్టీకి వాడుకుంటున్నారని అన్నారు. ఇంకా చంద్రబాబు తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారని, అసలు విచారణ చేస్తాం అంటేనే ఎందుకు భయపడుతున్నారని, విచారణలో ఎలాంటి తప్పు చేయకపోతే క్లీన్ చీట్ ఇస్తారు కదా అని అన్నారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్పందించడం, స్పందించకపోవడం వాళ్ళ నిర్ణయం అని అన్నారు.

కే‌టి‌ఆర్ ఇంకా మాట్లాడుతూ “చంద్రబాబు కంప్యూటర్ నేను కనిపెట్టానని అంటాడు మరి ఇప్పుడు EVM లంటే ఎందుకు భయపడుతున్నాడని” సెటైర్ లు వేశారు. చంద్రబాబు పరువు .ఆంధ్రా ప్రజలలో పోయిందని, ఆయన ఏ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ లో చేయలేదని, గ్రాఫిక్స్ లో మాత్రమే అభివృద్ధి చూపిస్తున్నారని, టి‌ఆర్‌ఎస్ ప్రభుత్వంపై దుమ్ము ఎత్తి పోస్తే ఆంధ్రలో ఓట్లు వస్తాయని చిల్లర వేషాలు చంద్రబాబు వేస్తున్నాడని అన్నారు.

 

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

స్టేజ్ పైనే తెలంగాణ కాంగ్రెస్ నేతల ఫైట్

Share this on WhatsApp ఒక్కసారిగా కాంగ్రెస్ వీహెచ్ తాతయ్య అర్జున్ రెడ్డిలా మారిపోయాడు. వన వం వం వం …