Tuesday , November 12 2019
Home / Entertainment / చంద్రబాబు నడవలేకపోతున్నారు-కె ఏ పాల్

చంద్రబాబు నడవలేకపోతున్నారు-కె ఏ పాల్

KA Paul Press Meet: కె ఏ పాల్ మీడియా ముందు మాట్లాడుతూ ” తన 25 మంది స్టేట్ కోఆర్డినేటర్ ల పేర్లు చదువుతాను అంటే ఒత్తిడి చేశారు.  చంద్రబాబు మీ  అవినీతిని చూపించనందుకా మా పై ఒత్తిడి చేశారు. నరేంద్ర గారు, చౌదరి ఎందుకు సడన్ గా కాల్ చేసి మళ్ళీ ఇప్పటి దాకా కాల్ చేయలేదు. ఈ రోజు సాయంత్రం 7 గంటలకి నా ప్రోగ్రాం NTV లో ఉంది. ఇప్పుడు ప్రోగ్రాం ఉందో లేదో చెప్పాలి వేల మందికి చెప్పనని అన్నాడు.

ఇంకా పాల్ మాట్లాడుతూ “మీడియా వాళ్ళు ఎవరికి భయపడద్దని, వంద రోజులు అయితే వీళ్ళు ఎవరు ముఖ్యమంత్రులుగా ఉండరని, జగన్ కలలో కూడా ముఖ్యమంత్రి అవ్వడని మరియు చంద్రబాబుకి రిటైర్మెంట్ వయసు వచ్చిందని, 65 సంవత్సరాలకి రిటైర్మెంట్ అవ్వాలని , ప్రస్తుతం చంద్రబాబు కి 69 సంవత్సరాల వయసు వచ్చిందని, తన రిటైర్మెంట్ అవ్వాలని అన్నాడు. అలాగే చంద్రబాబు మంచి పరిపాలకూడని, చంద్రబాబుని తన సలహాదారునిగా పెట్టుకుంటానని అన్నాడు. “చంద్రబాబు ప్రస్తుతం నడవ లేకపోతున్నారని, మెంటల్ గా టెన్షన్ పెరిగిందని” కె ఏ పాల్ అన్నాడు.

పాల్ మాట్లాడుతూ” కెఏ పాల్ అంటే ఎవరు ? చంద్రబాబు కి మంచి మిత్రుడని, గురువని, చంద్రబాబు ని గెలిపించే వ్యక్తిగా పేరు ఉందని, అలాగే చంద్రబాబుని తన అవినీతి కి సంబంధించిన విషయాలపై డిబేట్ కి రమ్మని సవాలు విసిరాడు. ఒకవేళ చంద్రబాబు రాకపోతే లోకేశ్ ని డిబేట్ కి రమ్మని సంచలన వ్యాఖ్యలు చేశాడు. లోకేశ్ కి అసలు మాట్లాడటం సరిగ్గా రాదని, లోకేశ్ వీడియో ఒకటి చూశానని, అందులో “దేశంలో కుల పిచ్చి, మత పిచ్చి, అవినీతి పార్టీ, మోసపూరిత పార్టీ ఏదైనా ఉంది అంటే అది తెలుగు దేశం పార్టీ అని ” అన్నాడని, బైబిల్ లో ఒక మాట ఉంటుందని చెప్తూ ఇలా చెప్పాడు “హృదయం లో ఏది ఉంటుందో అది నోరు మాట్లాడుతుందని అన్నాడు. అలాంటి లోకేశ్ కి ముగ్గురు మంత్రులా అంటూ సెటైర్ లు వేసాడు. చంద్రబాబుపై తాను విమర్శలు ఎందుకు చేస్తున్నానని చెప్పాడు అంటే రాష్ట్రంలో అవినీతి బాగా చేశారని అన్నాడు.

కె ఏ పాల్ అధికారంలోకి వస్తే “రుణ మాఫీలు చేస్తామని, ప్రతి నియోజక వర్గానికి 100 కోట్లు ఇస్తానని అన్నాడు.  ఒక అతను 40 సీట్లు అయిన మీకు వస్తాయా అని అడిగితే , 37 సీట్లు వచ్చిన కుమార స్వామి కర్నాటక ముఖ్యమంత్రి అయ్యాడని చెప్పాడు. రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో చెప్పలేమని, కాంగ్రెస్ భూస్థాపితం అవుతుందని, 10 సంవత్సరాలు ముందే చెప్పానని అన్నాడు. అలాగే జగన్ లాగా తన పై ఒక్క కేసు ఉందా చూపించమని అంటూనే ఒంగోల్ లో తనని అరెస్టు చేయించిన కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశిస్తూ మాట్లాడాడు. చెప్పు పార్టీ పెట్టిన కిరణ్ కుమార్ రెడ్డిని ప్రజలు చెప్పుతో కొట్టి పంపించారని అన్నాడు. ఇంకా మాట్లాడుతూ “తెలుగు ప్రజలు తెలివైన వారని, ప్రపంచం వదిలి మీ కోసం వచ్చానని” అన్నాడు.

Watch and Share It:

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

TRS మైత్రి వల్లే అక్బరుద్దీన్ పై కేసు లేదు

Share this on WhatsApp మొన్న కరీంనగర్ లో జరిగిన సభలో ఒవైసీ హిందువులని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసాడు. …