Tuesday , June 18 2019
Home / Politics / టి‌డి‌పి, YSCRCP లకి దిమ్మతిరిగేలా JP సవాల్

టి‌డి‌పి, YSCRCP లకి దిమ్మతిరిగేలా JP సవాల్

జయప్రకాష్ నారాయణ “టి‌డి‌పి, YSRCP గురించి మాట్లాడుతూ ఇంటర్వ్యూలో ఒక ఆట” ఆడుకున్నారు. జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ “టి‌డి‌పి గాని , YSCRCP గాని ఒక్కొక్క సీటుకి 10 నుండి 15 కోట్లు వరకు ప్రజలకి పంచి పెట్టలేదని గుండెల మీద చెయ్యి వేసుకోని చెప్పమనండి” అంటూ సవాలు చేశారు. ఇది నా బహిరంగ సవాలు “నిజంగా టి‌డి‌పి, YSCRCP లు డబ్బులు పంచలేదని చెప్పమనండి” అంటూ జయప్రకాష్ నారాయణ అన్నారు.  జయప్రకాష్ నారాయణ చెప్తున్న ఈ మాటలు అబద్ధం అని చెప్పమనండి  అంటూ విసిరారు. డబ్బే కాక కుల, మత, ప్రాంతీయ పేర్లతో రాజకీయం నడుస్తోందని అన్నారు. అలాగే చంద్రబాబు గాని, జగన్ గాని పేద పిల్లలకి ఉచిత విద్యను ఇస్తామని చెప్పారు కానీ మంచి విద్యని, మంచి వసతులు అందిస్తామని చెప్పలేదని జయప్రకాష్ నారాయణ అన్నారు.

పవన్ కల్యాణ్ ని ఓడిపోయాడు కదా అని యాంకర్ అడిగితే, జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ “అంబేడ్కర్ లాంటి వారి ఓడిపోయారని, గాంధీ, నెహ్రూ పక్కన ఉండే స్థాయి కలవాడని, అలాంటి వారే ఓడిపోగాలేనిది, పవన్ కల్యాణ్ ఎంత ?, పవన్ కల్యాణ్ డబ్బులు పంచకుండా 6 % వరకు ఓటింగ్ సాధించడం చిన్న విషయం కాదని అన్నారు. గాంధీ కూడా పోటీ చేసిన ఓడిపోతారని కొంత మంది అంటున్నారని చెప్పారు.

ఈయన ఇంకా మాట్లాడుతూ “గెలుపు , ఓటములు చాలా చిన్న విషయాలు అని, అందులో డెపాజిట్ లు వచ్చాయా రాలేదా ఇవి కాదని అన్నారు. అయినా ఎవరు గెలిస్తే ఏంటి, 70 ఏళ్ళుగా ఎవరో ఒకరు గెలుస్తున్నారు కదా దేశాన్ని ఏం ఉద్ధరిస్తున్నారు. ఏమైనా అద్భుతాలు జరుగుతున్నాయా అని అన్నారు. ప్రజలకి అన్ని సవ్యంగా జరుగుతున్నాయా లేదా, ఎన్నికైన వాడు సరైన వాడా కాదనేది ముఖ్యమని, ప్రజలకి ఎంత వరకు చేస్తున్నాడనేది ముఖ్యమని తెలిపారు. మళ్ళీ ఓడిన కూడా ఎవరి పనిలో వాళ్ళు హ్యాపీ గా ఉంటారని, పవన్ కల్యాణ్ మళ్ళీ సినిమా చేస్తే 5 కోట్లో, 10 కోట్లో ఇస్తారని అన్నాడు. ఒక మనిషి గెలవగానే ఆయనకు ఏమైనా భూషణం వస్తుందా అని అన్నారు. నాయకులు గెలిచినా ఓడినా కాలు మీద కాలు వేసుకొని బ్రతుకుతారని, కార్యకర్తలే  జెండాలు పట్టే కూలీలుగా మిగిలిపోతారని అన్నారు. కానీ అటువంటి వాళ్ళే రాజకీయాలలోకి రావాలని అన్నారు. ఎవరు గెలిచినా ఇవన్నీ ప్రజల జీవితాల మీద ఆధారపడి ఉన్నదని చెప్పారు.

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

బి‌జే‌పి MLA రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు

Share this on WhatsApp యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉండి ఎక్కువగా ప్రజల గుండెల్లో ఉన్న వాదనలని మరియు …