Wednesday , April 24 2019
Home / International / పాక్ F16 జెట్ ని బూడిద చేసిన జవాన్ అభినందన్

పాక్ F16 జెట్ ని బూడిద చేసిన జవాన్ అభినందన్

భారత వైమానిక దళానికి సంబంధించిన వింగ్ కమాండర్ వీర జవాన్ అభినందన్ గారు భారత భూభాగాన్ని దాటి పాకిస్థాన్ లోకి ప్రవేశించి Pak F-16 యుద్ధ విమానాన్ని బూడిద చేశారు. కానీ అనుకోని పరిస్థితుల వల్ల అభినందన్ గారి  మిగ్-21 విమానంలో సాంకేతిక లోపాల వల్ల పాక్ భూభాగంలో పారా షూట్ ద్వారా హోరా అనే ప్రాంతంలో దిగారు. దిగిన తర్వాత అక్కడ ఉన్న పాకిస్తానీలని ఎక్కడున్నని అభినందన్ గారు అడుగగా వాళ్ళు తప్పుడు సమాచారం ఇస్తూ భారత్ అని చెప్పారు, ఆ తర్వాత సంతోషంతో అభినందన్ గారు “భారత్ మాతా కీ జై ” అని నినాదాలు చేశారు. అక్కడ ఉన్న పాకి యువకులు తర్వాత మన భారత్ జవాన్ అభినందన్ పైకి రాళ్ళ దాడి చేశారు. వాళ్ళని అభినందన్ గారు దాహమని అడిగిన కూడా రాళ్ళతో కొట్టారు. కానీ అక్కడ నుండి అభినందన్ గారు అర కిలోమీటర్ వరకు పరిగెత్తి భారత రహస్య సమాచారాన్ని కొంత నమిలి , మిగతా సమాచారాన్ని అక్కడ  ప్రవహిస్తున్న ఉన్న కాలువలో కలిపేశారు. ఆ తర్వాత పాకి కుక్కలు అభినందన్ గారిని రక్తం కారేలా కొట్టారు. ఇది పాక్ మీడియాలో వైరల్ చేస్తూ భారతప్రజలని భయానికి గురి చేయాలని ప్రయత్నించారు. కానీ భారత్ ప్రజలు పాకిస్థాన్ కి వార్నింగ్ లు ఇస్తూ త్వరగా తిరిగి అబినందన్ గారిని భారత్ పంపించాలని అన్నారు. అభినందన్ వర్తమాన్ గారిని వదలకపోతే యుద్ధమేనని భారత్ ప్రజలు హెచ్చరించారు.

ఆ తర్వాత మళ్ళీ పాక్ మీడియాలో అభినందన్ గారు భద్రంగా ఉన్నట్లు తెలియజేసారు.  అభినందన్ గారిని పాక్ ఆర్మీ అడిగిన ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చారు. కానీ రహస్యమైన విషయాలని ఏం మాత్రం బయట పెట్టడానికి ఇష్టపడలేదు. ఆ వీడియోలో అబినందన్ గారు టీ తాగుతూ 1 % కూడా భయపడకుండా సమాధానం ఇచ్చారు.

అయితే ఇప్పుడు పాకిస్థాన్ లో ఉన్న అబినందన్ గారిని జెనీవా ఒప్పందం ప్రకారం తిరిగి భారత్ కి అప్పగించాల్సిందిగా మోడీ గారు హెచ్చరించారు. ఈ ఒప్పందం ప్రకారం అప్పగించకపోతే యుధ్ధానికి పాకిస్థాన్ ఒప్పుకున్నట్లేనని అర్థం, కానీ ఇమ్రాన్ ఖాన్ భయపడి తిరిగి వెంటనే భారత్ కి ఈ రోజు అప్పగిస్తున్నారు. ప్రస్తుతం పాకిస్థాన్ ని ప్రపంచ దేశాల ముందు తల ఎత్తుకుకోకుండా మోడి గారు చేస్తున్నారు. పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలకి కేంద్రంగా తయారైందని ఆధారాలతో సహ పాకిస్థాన్ పరువు ప్రపంచ దేశాల ముందు తీశారు. ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికీ యుద్ధం అంటే భయపడుతున్నాడు ఎందుకంటే మోడీ ఇప్పటికీ మూడు నదుల నీళ్ళు దారి మళ్ళించారు. అలాగే ప్రపంచ దేశాల నుండి పాకిస్థాన్ కి రుణాలు రాకుండా చేశారు. అలాగే కూరగాయల విషయంలో తీవ్ర స్థాయిలో ఇబ్బందికి గురి చేశారు. అలాగే పాకిస్థాన్ ఒకవేళ యుద్ధానికి దిగితే భారత్ చేసే యుద్ధంతో ప్రపంచంలో పాకిస్థాన్ లేకుండా పోతుందని భయం.

ఇంకా ఈ రోజు కొన్ని గంటలలో పాక్ నుండి భారత్ కి అభినందన్ గారు రాబోతున్నారు. ప్రస్తుతం దేశ ప్రజలు మొత్తం అభినందన్ వర్తమాన్ గారి వైపు చూస్తున్నారు. భారతప్రజలు స్వాగతం పలుకుతూ “భారత్ మాతా కీ జై ” అంటూ నినాదాలు చేస్తున్నారు. అభినందన్ వర్తమాన్ గారిని వాఘా సరిహద్దు దగ్గర పాకిస్థాన్ అప్పగించబోతుంది. వాఘా సరిహద్దు వద్ద భారత ప్రజలు జాతీయ జెండాలతో “భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు చేస్తున్నారు.

Watch and Share It:-

Watch this Video:-

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

ఇవి తింటే మీ పిల్లలు త్వరగా చస్తారు-చూడండి

Share this on WhatsApp పిల్లలే ప్రాణం అని బతికే భారతీయులం మనం. మన పిల్లలకి చిన్న దెబ్బ తగిలితేనే …