Friday , August 23 2019
Home / Devotional / మంత్రాలు అసలు ఎందుకు పని చేయవు? ఏమి చేయాలి?

మంత్రాలు అసలు ఎందుకు పని చేయవు? ఏమి చేయాలి?

ప్రస్తుత సమాజంలో సనాథన ధర్మాన్ని వెక్కిరించే వాళ్ళు వేల కొలదిలో తయారు అయ్యారు. ఇలా అవమానించే వారు మత మార్పిడి చేసుకున్నవారే. అయితే కొంత మంది ఉద్దేశ పూర్వకంగా టి‌వి డిబేట్ లు పెట్టి మరీ సనాథన ధర్మాన్ని అవమానిస్తున్నారు. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అంటూ అవహేళన చేస్తారు. అసలు మంత్రాలు నిజంగా పనిచేస్తాయా ? , నిజంగా వాటితో అనుకున్నవి అవుతాయా ?, ఇలా ఎన్నో ప్రశ్నలు సమాజంలో ఉన్న యువకులకి కలుగుతున్నాయి. ఇలాంటి వారికి సమాధానం ఇవ్వటానికి ఈ వేద భూమి ఎందరో మహానుభావులని, యోగులని, సిద్ద పురుషులని, జగద్గురులని పంపిస్తూనే ఉంటుంది. శ్రీ సిద్దేశ్వరి పీఠం యొక్క పీఠాధిపతిగా శ్రీశ్రీశ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి వారు ఉన్నారు. ఈ స్వామి వారికి పరమ హంస, పరివ్రజాచార్య, జగద్గురు అనే గొప్ప స్థితిని సూచించే స్థాయిలు అలంకారాలుగా ఉన్నాయి. ఈ స్వామి చెప్పే రహస్యాలు, అద్భుతమైన విషయాలు వింటుంటే రోమాలు నిక్కబొడుచుకునే  విధంగా ఉంటాయి.

అయితే శ్రీశ్రీశ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి గారు మాట్లాడుతూ “గ్రహణ సమయంలో చేసే పునశ్చరణ చాలా గొప్పదని, దాని వల్ల గొప్ప ఫలితాలు ఉంటాయని చెప్పారు. పూర్వం కాలంలో ద్రోణాచార్యుడు అర్జునిడికి మంత్ర అస్త్రం ఇవ్వగానే పనిచేసిందని అన్నారు. పురాణాల ప్రకారం మంత్రాలు సిద్ధించాలంటే లక్షల జపాలు చేయాలని, ఒక్కో మంత్రానికి సిద్ధి ఒక్కో రకంగా ఉంటుందని అన్నారు. బ్రహ్మండ పురాణం ప్రకారం లలితా జపం 36 లక్షలు చేయాలని చెప్పారు. కొన్ని సిద్ధస్థితులు రావాలంటే అన్ని లక్షల జపాలు చేయాలని అన్నారు. చాలా మంది మంత్రాలు చేసే పద్దతిని సరిగ్గా చేయరని, మంత్రాలు సిద్ధించాలంటే పునశ్చరణ చేయాలని కానీ లోకంలో మనుషులకి పునశ్చరణ చేసే అంతా ఓపిక లేదని చెప్పారు. ఒక ఉదాహరణ చెప్తూ ఒకసారి ఒకాయన స్వామి వారి వద్దకి వచ్చాడని, .అతను చేసే మంత్రం తనకి పనిచేయడం లేదని, అతను గాయత్రి మంత్రం రోజు 108 సార్లు చేస్తున్న మంత్రం ఫలితం ఉండటం లేదని, పైగా తనకు అన్ని కష్టాలే వస్తున్నాయని చెప్పడన్నారు. అయితే స్వామి వారు కష్టాలు అనేవి పూర్వ జన్మ కర్మల వల్ల వస్తాయని, కర్మ దేవతలు ఒకదాని వెనుక ఒకటి కర్మలు ఇస్తాయని, ఇందులో రెండు కర్మలు ఉంటాయని మంచివి చెడ్డవని చెప్పారు. మంత్రం మీద అధికారం రావాలంటే పునశ్చరణ చేయాలని అన్నారు. అసలు పునశ్చరణ అంటే లక్షల జపాలు చేయాలి. అయినా కూడా మంత్ర దేవి ప్రసన్నమవ్వదని, కానీ మంత్రం మీద ప్రారంభ అధికారం మాత్రమే వస్తుందని అన్నారు.

మంత్రం మీద అధికారం రావడం మొదలు అవ్వాలంటే

  1. ఏకభుక్తం చేయాలి.
  2. బ్రహ్మచర్యం చేయాలి.
  3. భూశయనం చేయాలి. నేల మీద పడుకోవాలి.
  4. పునశ్చరణ సమయంలో ఊరి పొలిమేర దాటకూడదు.
  5. నశకేశ ఖండనం చేయకూడదు.
  6. దశాంశం పది వేలు హోమం చేయాలి.
  7.  దశాంశం వెయ్యి తర్పణం చేయాలి.
  8.  దశాంశం మార్జనమ్ చేయాలి.
  9. దశాంశం పది మందికి భోజనం పెట్టాలి.

ఇవన్నీ చేస్తే అప్పుడు మంత్రమపై అధికారం వస్తుంది. మంత్రంపై అధికారం వచ్చిన తర్వాత హోమంలో వేసే ఉపయోగించే హవిస్సులని బట్టి రకరకాలైన కోరికలు సిద్ధిస్తాయని చెప్పారు.

Watch and Share It:-

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

అక్బరుద్దీన్ కి వార్నింగ్ ఇచ్చిన రాజాసింగ్

Share this on WhatsApp మొన్న హైదరాబాద్ లో అక్బరుద్దీన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో అందరూ మండిపడుతున్నారు. …