Thursday , October 17 2019
Home / Politics / చంద్రబాబుకి పిచ్చి పీక్స్ లో ఉంది – GVL

చంద్రబాబుకి పిచ్చి పీక్స్ లో ఉంది – GVL

ఈ మధ్యనే చంద్రబాబు అసెంబ్లీలో బి‌జే‌పి MLAలని అవమానిస్తూ మాట్లాడిన ప్రసంగానికి కౌంటర్ గా GVL నరసింహరావు ట్వీట్ చేశారు.  ఆ ట్వీట్ లో ” చంద్రబాబు అసెంబ్లీలో బి‌జే‌పి ఫ్లోర్ లీడర్ విష్ణు కుమార్ రాజుగారితో ప్రవర్తించిన తీరు చూస్తే “పిచ్చి పీక్స్ ” కు చేరినట్లు తెలుస్తోంది. మహా ప్రస్ట్రేషన్లో వున్న సి‌ఎం “అసెంబ్లీ రౌడీ” లాగా ప్రవర్తించారు. సి‌ఎంపై సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చే ఆలోచన” అని అన్నారు.

అయితే చంద్రబాబు “బి‌జే‌పి నాయకులకి MLA పదవులు కూడా వ్యర్థం అని అన్నాడు. దానికి చాలా మంది బి‌జే‌పి నాయకుల నుండి వ్యతిరేకత వచ్చింది. కానీ GVL నరసింహరావు ట్వీటర్ లో గట్టిగా కౌంటర్ ఇచ్చారు.

GVL నరసింహరావు గారి ఇంకొక ట్వీట్ లో “చంద్రబాబు నాయుడు ఒక బి‌జే‌పి మహిళ కార్పొరేటర్ ని చంపేస్తానని బెదిరించాడని, అలాగే బి‌జే‌పి ఫ్లోర్ లీడర్ ని కూడా బెదిరించాడని, అలాగే ఆంధ్ర ప్రదేశ్ లో తిరగనివ్వమని అసెంబ్లీలో నేరుగా బెదిరిస్తూ, ఇప్పుడు ఢీల్లిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని నీతులు భోదిస్తున్నాడని ట్వీట్ లో చెప్పారు.

ఇంకొక ట్వీట్ లో టి‌డి‌పి MLA శ్రవణ్ కుమార్ ని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. అయితే టి‌డి‌పి MLA శ్రవణ్ కుమార్ GVL  ట్వీట్ లపై నోటిస్ ఇస్తునట్లు చెప్పాడు. అలాగే GVL కి బలుపు ఎక్కువైందని అంటూ లైవ్ ప్రోగ్రాంలో మాట్లాడాడు.

GVL నరసింహారావు మరోక ట్వీట్ తో MLA శ్రవణ్ కుమార్ కి కౌంటర్ ఇచ్చారు. ఆ ట్వీట్ లో “మా MLAల పట్ల దురుసుగా ప్రవర్తించిన చంద్రబాబు గారికి సభ ఉల్లంఘన హక్కుల నోటిస్ ఇవ్వాలని ఈ రోజు ఉదయం మాణిక్యాల రావు గారు అసెంబ్లీ సెక్రటేరియట్ ను సంప్రదించారు. ఈ విషయం తెలిసిన టి‌డి‌పి ముందుగా నా పై ‘ఉత్తీత్తి ‘ కంప్లైంట్ చేసి తమ భయాన్ని చాటి చెప్పారు. ఇది చవకబారు ప్రయత్నం మాత్రమే అని ట్వీట్ లో అన్నారు. క్రింద ఆ ట్వీట్ .

 .

GVL నరసింహరావు గారు ఇంకోక  ట్వీట్ లో “చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో, కేంద్రం ఇచ్చే నిధులకి మరియు ప్రజల డబ్బుకి రక్షణ లేదు. చివరికి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నగలకి కూడా రక్షణ లేదు. టి‌టి‌డి దేవస్థానంలో దొంగతనం జరిగింది” అని అన్నారు.

ఈ మధ్యనే స్వామి వారి కిరీటాలు పోవడం మనకు తెలిసిన విషయమే. అప్పట్లో పింక్ డైమెండ్ దొంగతనానికి గురి అయింది. ఇంత వరకు ఎవరు వాటి ప్రస్తావనే లేదు.

GVL గారు ఇంకొక ట్వీట్ లో “నేను స్వయంగా ఈ రోజు కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ గారిని కలిసాను మరియు టి‌డి‌పి నాయకుల యొక్క నేర ప్రవర్తనపై కంప్లెంట్ చేశాను. ముఖ్యంగా కాల్ మనీ, సెక్స్ రాకెట్ కేసులలో ఉన్న MLC బుద్ధ వెంకన్న పై కంప్లెంట్ ఇచ్చాను. టి‌డి‌పి ఆంధ్రప్రదేశ్ లో చేస్తున్న బి‌జే‌పిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్న విషయం వివరించాను అని అన్నారు.

GVL నరసింహరావు గారు రాజ్ నాథ్ సింగ్ గారికి అందించిన కంప్లెంట్ నోటీసులు కింద ఇస్తున్నాము, చూడండి.

 

అలాగే బి‌జే‌పి ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన నిధుల వివరాలని GVL నరసింహరావు గారు తన ట్వీట్ లో చెప్పారు. ఆ ట్వీట్ సారాంశం

ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన నిధుల వివరాలు “14 వ ఫైనాన్స్ కమిషన్ కింద

  • 2015 నుండి 2016 వరకు 30,449 కోట్లు
  • 2016 నుండి 2017 వరకు 34,308 కోట్లు
  • 2017 నుండి 2018 వరకు 35,975 కోట్లు
  • 2018 నుండి 2019 వరకు 22,995 కోట్లు ఇంకా అందివ్వ బోతున్నామని అన్నారు.
  • 22,000 కోట్లు లోటు బడ్జెట్ కి 5 సంవత్సరాలకి ఇచ్చామని చెప్పారు.
  • ఇంకా లక్షల కోట్లు ప్రాజెక్టులు 5 సంవత్సరాలుగా అందిస్తున్నామని చెప్పారు.

GVL నరసింహరావు గారు మీడియా ముందు మాట్లాడుతూ ” తెలుగు దేశం నాయకులు ఇలా పిచ్చి ప్రేలాపనలు చేయడం కొత్తేమీ కాదు, ఇంతకు ముందు కూడా చేశారు. కానీ ఈ సారి వీళ్ళ పిచ్చి వాగుడు ఎక్కువ అయిందని అన్నారు. మేము వీళ్ళలాగా దేహా శుద్ది చేస్తామని పిచ్చి వాగుడు వాగము కానీ తగిన బుద్ధి చెప్తాము. అయితే ఈ మధ్య టి‌డి‌పి MLC బుద్ధ వెంకన్న GVL కి దేహ శుద్ధి చేస్తానని మీడియా ముందు అన్నాడు. ఈ విషయంపై రాజ్ నాథ్ సింగ్ గారికి బుద్ధ వెంకన్న పై కంప్లెంట్ ఇచ్చానని చెప్పారు. బుద్ధ వెంకన్న కాల్ మనీ మరియు సెక్స్ రాకెట్ కేసులలో క్రిమినల్ ప్రవర్తన కలిగి ఉన్న అభియోగిగా ఉన్నాడు. కావున ఇతని పై చర్యలు తీసుకోవలసిందిగా రాజ్ నాథ్ సింగ్ గారికి కంప్లెంట్ ఇచ్చారు.

GVL ని బెదిరించినందుకు, కాల్ మనీ మరియు సెక్స్ రాకెట్ లలో అభియోగిగా ఉన్న బుద్ధ వెంకన్నపై రాష్ట్ర DGP కి కేసును ఇచ్చి FIR రిజిస్టర్ చేయాల్సిందిగా కోరారు. అతని క్రిమినల్ బ్యాగ్రౌండ్ పై దర్యాప్తు చేయాల్సిందిగా లేఖలో కోరారు. అవసరమైతే CBI కి కూడా ఈ కేసుని ఇవ్వాలని కోరారు. అలాగే రౌడీయిజం చేసే టి‌డి‌పి నాయకులందరిని ఒక విధంగా ముఖ్యమంత్రే పెంపొందించే విధంగా ఉన్నారని, ఇలా ఉండటం దురదృష్టకరం అని అన్నారు. ప్రస్తుతం చంద్రబాబు బి‌జే‌పి లీడర్ ల పై బెదిరింపులకి దిగుతున్నాడని అన్నారు. అలాగే బి‌జే‌పి నాయకులపై బెదిరింపులకి దిగి రౌడీయిజం చేసే టి‌డి‌పి వాళ్ళకు స్ట్రాంగ్ వార్నింగ్ అంటూ సంకేతం ఇచ్చారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని శాంతి , భద్రతల విషయంగా కంప్లెంట్ ఇచ్చామని అన్నారు. ఇక ముందు టి‌డి‌పి నాయకులు బెదిరింపులు మరియు ఇలాంటి పిచ్చి మాటలని మానుకుంటే మంచిదని అన్నారు. పూర్తి విషయం కోసం వీడియో చూడగలరు.

Watch and Share It:-

 

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

TRS మైత్రి వల్లే అక్బరుద్దీన్ పై కేసు లేదు

Share this on WhatsApp మొన్న కరీంనగర్ లో జరిగిన సభలో ఒవైసీ హిందువులని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసాడు. …