Tuesday , July 23 2019
Home / Devotional / వెయ్యి జన్మలు 1రోజులో అనుభవింప జేసిన జ్ఞాని

వెయ్యి జన్మలు 1రోజులో అనుభవింప జేసిన జ్ఞాని

ఈ భరత భూమి ఎంతో మంది మహా యోగులని, జ్ఞానులని, ఋషులని, మహర్షిలని, ఎందరో మహానుభావులని మరియు కర్తలని ఇచ్చింది. ఈ భూమి వేద భూమి, ఈ భూమి మోక్ష భూమి, ఎందరో మహానుభావులు, పుణ్య పురుషులు నడిచిన భూమి ఇది, ధర్మాన్ని నాలుగు పాదాల మీద నడిపిన భూమి. ఇలాంటి భూమిపై నేను ఎవరు అనే ప్రశ్న పుట్టిన ఆలోచన కలిగిన వ్యక్తి మహాజ్ఞానిగా అవతరించాడు. ఆయనే శ్రీ రమణులు (శ్రీ రమణ మహర్షి ).

శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు అద్బుతమైన ప్రవచనం శ్రీ రమణ మహర్షి గారిపై చెప్పారు. శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు చెప్తూ “అలగమ్మ గారు స్కంధాశ్రమమ్ కి వెళ్ళిన తర్వాత అనారోగ్యానికి గురి అయి ప్రాణం విడిచే సమయం ఆసన్నమైంది.  తర్వాత అమ్మ గారు మాట ఆగిపోయింది. అయితే అలగమ్మ ఉన్న గదిని మోక్షమిచ్చిన గదిగా అభివర్ణిస్తారు. ఆ గదిలో శ్రీ రమణ మహర్షి అమ్మ దగ్గర కూర్చొని గుండెల మీద కుడి చెయ్యి పెట్టి తల మీద ఎడమ చెయ్యి పెట్టి పట్టుకున్నారు. అలా తెల్లవారు జమున నుండి రాత్రి 8 గంటల పట్టుకున్నారు. శ్రీ రమణ మహర్షులు అమ్మ మోక్షం పొందింది అని చెప్పారు. కొన్ని వేల జన్మలు ఎత్తవలసిన అలగమ్మని సూక్ష్మ శరీరం ద్వారా ఒకేసారి వేల జన్మల అనుభవింపజేసి మోక్షాన్ని అందించారు.  మళ్ళీ పుట్టడానికి ఎలాంటి కర్మలు లేకుండా చేశారు. అలగమ్మ సిద్ధి పొందేలా చేశారు. అమ్మ గారి శరీరాన్ని కూడా సన్యాసులని ఖననం చేసిన విధంగా చేశారు. శ్రీ రమణ మహర్షి అమ్మ మోక్షం పొందిన తర్వాత వెళ్ళి ఉదయాన్నే భోజనం చేశారు ఎందుకంటే ఆయన జ్ఞాని. ఆయన ఉన్న స్థితి ,తత్వం, స్థాయి వేరు. ఒక జ్ఞానికి మాత్రమే ఇలాంటివి వర్తిస్తాయి. సామాన్యులు ఇలా చేయకూడదు. అలగమ్మ గారి సమాధిపై కాశి నుండి వచ్చిన శివ లింగాన్ని ప్రతిష్టించారు. అమ్మ గారి సమాధికి భూతేశ్వరాలయం అని అన్నారు.

Watch and Share It:-

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

దేశంలోనే No.1 అప్పుల రాష్ట్రం షేర్ చేయండి

Share this on WhatsApp తెలంగాణ ప్రజలకి దిమ్మ తిరిగేలా నిజాలు బయటపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్. …