Monday , March 18 2019
Home / Politics / నా తండ్రి చావుకి చంద్రబాబే కారణం-రైతు బిడ్డ

నా తండ్రి చావుకి చంద్రబాబే కారణం-రైతు బిడ్డ

దేశానికి అన్నం పెట్టె రైతుతో ఇన్ని రాజకీయాలా, ఇంత దౌర్జన్యమా?, రైతుపై పోలీసులు దాడి చేసి చంపేశారని మృతుడి కొడుకు చెప్తున్నాడు. పోలీసులని రక్షించే పనిలో ప్రభుత్వం, ఎన్నికలని దృష్టిలో పెట్టుకొని రైతు మరణంపై రాజకీయాలు. అసలు పచ్చి నిజాలు ఏంటో తెలుసుకోండి. గుంటూరు జిల్లా ఎడ్ల‌పాడు మండ‌లం కొండ‌వీడు గ్రామంలోని రైతు కోటేశ్వ‌ రరావు చావుకి చంద్రబాబు సభే కారణమని, రైతు కొడుకు వీరాంజనేయులు తెల్పుతున్నారు. వీరాంజనేయులు మీడియా డిబేట్ లో ఫోన్ ద్వారా మాట్లాడారు. వీరాంజనేయులు మాట్లాడుతూ “పోలీసు అధికారుల వల్లే  తన తండ్రి చనిపోయాడని చెప్తున్నారు. చంద్రబాబు రైతు యొక్క పొలాన్ని రాత్రికి రాత్రే పోలీసులకి ఇచ్చేసినట్టు పోలీసులు చెప్పారని, వీరాంజనేయులు తీవ్రమైన ఆవేదనతో మీడియా ముందు ఏడుస్తూ మాట్లాడారు.

ఇంకా వీరాంజనేయులు మాట్లాడుతూ “వీళ్ళ పొలం 14 ఎకరాలని, అయితే ఒక ఎకరంలో సి‌ఎం సభ కోసం గుడారాలు వేసుకుంటామని ఎడ్లగూడ SI అడిగినట్లు” చెప్పారు. అయితే ఆదివారం గుడారాలు వేసుకొని పోలీసులు అంతా పక్కన ఉన్న వీళ్ళ పంటలోకి వచ్చారని చెప్తున్నారు. పోలీసులు తోటలోకి వచ్చి కాయలు తెంపారని, అదే సమయంలో అక్కడ ఉన్న వీరాంజానేయులు తల్లి వద్దని చెప్పిందని, ఒకవేళ తెంపితే డబ్బులు ఇవ్వమని అడిగారని అన్నారు. కానీ పోలీసులు డబ్బులు ఇవ్వమని అన్నారు. తర్వాత రోజు పొలంలోని పంటపై కార్లు, బైక్ లతో పంట నాశనం చేశారని అన్నారు. ఇదేంటి అని రైతు కోటేశ్వర రావు పోలీసులని, అధికారులని ప్రశ్నించినందుకు తిరగబడ్డారని చెప్తున్నారు. అలాగే “చంద్రబాబు పొలం తమకి ఇచ్చారని దౌర్జన్యంగా మాట్లాడారని” చెప్పారు. రైతు కోటేశ్వర రావుని తన పొలంలోకి వెళ్ళన్నివ్వకుండా అమానుషంగా ప్రవర్తించారని చెప్పారు. తర్వాతే వీరాంజనేయులు చనిపోయినట్టు వార్త బయటకి వచ్చినట్టు చెప్తున్నారు.

కానీ పోలీసులు మందు తాగి చనిపోయాడని చెప్తున్నారు. ఇంకా వీరాంజనేయులు మాట్లాడుతూ “పోలీసులు దాడి చేసి రైతుని చంపేసినట్టుగా చెప్తున్నారు. తర్వాత మూడు లక్షలు ఆఫర్ చేసి రైతు చనిపోయిన విషయం బయటకు రాకూడదని ప్రయత్నించారని చెప్పారు. ఫేక్ గా వీడియోలు చేసి పోలీసులు చేసిన మరణాన్ని దారి మళ్ళీస్తున్నారని చెప్తున్నారు. పోస్ట్ మార్టంలో మందు తాగి రైతు చనిపోలేదని తేలిందని చెప్తున్నారు. పోలీసులు తన తండ్రిని దాడి చేసి చంపేసినట్లుగా చెప్తున్నాడు. ఒకవేళ న్యాయం జరగకపోతే “కుటుంబం మొత్తం చనిపోతామంటూ తీవ్రమైన ఆవేదనతో ఏడుస్తూ” మాట్లాడారు. పూర్తి విషయం కోసం వీడియో చూడగలరు.

Watch this Video:-

 

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

ఇవి తింటే మీ పిల్లలు త్వరగా చస్తారు-చూడండి

Share this on WhatsApp పిల్లలే ప్రాణం అని బతికే భారతీయులం మనం. మన పిల్లలకి చిన్న దెబ్బ తగిలితేనే …