Tuesday , May 21 2019
Home / National / DSP సరిత గారి స్పీచ్ వింటే ఫ్యాన్ అయిపోతారు

DSP సరిత గారి స్పీచ్ వింటే ఫ్యాన్ అయిపోతారు

DSP సరిత గారు ఇచ్చే ప్రసంగాలు యువతని మరియు పెద్ద వాళ్ళని చాలా భావోద్వేగాలకు గురి చేస్తాయి.  యువతని మంచి మార్గంలో నడిచేలా సరిత గారి మాటల తుటాలు పని చేస్తాయి. నిజంగా ఈ సరిత గారి ప్రసంగాలు వింటే మీరు తప్పక మేడమ్ కు అభిమాని అయిపోతారు. ప్రస్తుతం సమాజంలో యువత ఎలా తప్పుడు మార్గంలోకి వెళ్తున్నారో చక్కగా వివరించారు. అయితే ఈ ప్రసంగంలో తల్లి తండ్రి ఒక కూతురి యొక్క సంఘటనని వివరించారు.

సరిత గారు మాట్లాడుతూ “విదేశాల్లో చదువుకుంటున్న ఒక అమ్మాయి అనారోగ్యం కారణంగా ఇండియాకి వచ్చిందని, తర్వాత బరువు తగ్గించుకోవడానికి ఫిట్ నేస్ సెంటర్ కి వెళ్ళిందని, అక్కడ ఫిట్ నేస్ సెంటర్ లో ట్రైనింగ్ ఇస్తున్న ట్రైనర్ కి ఈమె కి మధ్య పరిచయం ఏర్పడిందని, కొద్ది రోజులకు ఆ పరిచయం కాస్త శృతి మించిపోయి అక్రమ సంబంధంకి దారి తీసిందని చెప్పారు. నిజానికి ఆ ట్రైనర్ కి పెళ్ళి అయ్యి పిల్లలు ఉన్నారని ఆమెకి తర్వాత తెలిసిందని, అలా తెలిసిన కూడా అతనితోనే సంబంధంలో కొనసాగిందని, కొన్ని రోజులకి అతను ఆమె కి డ్రగ్స్ అలవాటు చేశాడని, తర్వాత తల్లి తండ్రులు ఒత్తిడి చేసే ఆ యువతిని దారిలో పెట్టడానికి ప్రయత్నించారని కానీ ఆ యువతి వాళ్ళ తల్లి తండ్రులపైనే గృహ నిర్బంధం చేస్తున్నారని కేసు పెట్టిందని అన్నారు. ఇక పెద్దలందరి సమక్షంలో కూర్చో బెట్టి మాట్లాడారని అన్నారు. కొన్ని రోజులకు ఈ యువతి బాగా అయ్యాక వేరే ప్రాంతంలో ఉండటానికి పంపించారు. మళ్ళీ అక్కడ కూడా మొదటి లాగే ప్రవర్తించడం చేస్తుందని మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చారు. ఆ యువతి తల్లి తండ్రులు ఆమె దగ్గరి నుండి ఫోన్ తీసుకుంటే తర్వాత ఆత్మహత్య యత్నం 2 సార్లు చేసుకుందని అన్నారు. కొన్ని రోజులకు మళ్ళీ కొంత మారిన తర్వాత డైరీలో తన మనోవేదన రాసిందని , ట్రైనర్ మోసం చేశాడని రాసింది అని చెప్పారు. ట్రైనర్ పై కేసు పెట్టారని, కానీ ఆ పెళ్ళి అయిన ట్రైనర్ యే కావాలని చెపుతూ కేసు ఎటు తేల్చలేక కొనసాగేలా చేసిందని అన్నారు. ట్రైనర్ ఈ యువతిని కొంత మానిప్యులేట్ చేశాడని అందుకు మళ్ళీ అతనే కావాలని చెప్పిందని అన్నారు.  చివరగా తల్లి తండ్రులు .ఇంటికి తీసుకెళ్లారు. కానీ కొంత ఒత్తిడి చేయడం వల్ల ఫోన్ వైర్ తో తల్లిని చంపడానికి ఆ యువతి ప్రయత్నించిందని, అలాగే తన తండ్రిని చేయిపై కొరికిందని చెప్పారు. ఆ యువతి మానసికంగా సైకో లా మారిందని, తర్వాత కొన్ని రోజులకు తన తల్లి తండ్రుల ఇంటి చుట్టూ కారు లో వెళ్తూ స్మోక్ చేస్తూ, డ్రింక్ చేస్తూ పైశాచిక ఆనందం పొందుతుందని వివరించారు.

Watch and Share It:-

 

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

స్టేజ్ పైనే తెలంగాణ కాంగ్రెస్ నేతల ఫైట్

Share this on WhatsApp ఒక్కసారిగా కాంగ్రెస్ వీహెచ్ తాతయ్య అర్జున్ రెడ్డిలా మారిపోయాడు. వన వం వం వం …