Sunday , September 15 2019
Home / Ancient Indian Science&Tech / వేల ఏళ్ళుగా శివున్ని అభిషేకిస్తున్న నంది

వేల ఏళ్ళుగా శివున్ని అభిషేకిస్తున్న నంది

ఈ ఒక్క క్షేత్రం యొక్క విశిష్టత చాలు మన పూర్వ భారతీయులు ఎంతగా Advanced Science ని develop చేశారో తెలుస్తుంది. నిజంగా ఎలాంటి మోటార్ సాయం లేకుండా వేల సంవత్సరాల నుండి ఈ క్షేత్రంలో ఉన్న నంది, కింద భాగంలో ఉన్న శివ లింగాన్ని నిరంతరం అభిషేకం చేస్తూనే ఉంది. ఈ పుణ్యక్షేత్రం పేరు దక్షిణాముఖ నంది తీర్థ కల్యాణి క్షేత్రం. దీన్ని నంది తీర్థం అని మరియు బసవ తీర్థం అని కూడా పిలుస్తారు.  ఈ క్షేత్రం బెంగుళూరులోని మల్లేశ్వరం దగ్గరలో ఉంది. గంగమ్మ ఆలయం దగ్గరలో ఈ క్షేత్రం ఉంటుంది.

ఈ క్షేత్రం లోపల పైన భాగంలో నంది, రాతికప్పు  క్రింది భాగంలో శివ లింగం ప్రతిష్టించబడి ఉన్నాయి. అయితే పైన నంది నోటి నుండి జాలు వారుతున్న నీరు రాతి కప్పుకున్న రంధ్రం ద్వారా  శివలింగం పై పడి, అక్కడ శివలింగం నుండి కల్యాణి తీర్థంలోకి వెళ్ళిపోతాయి. అయితే ఆ కల్యాణి తీర్థంలో ఒక సుడి గుండం ఉంది. ఆ సుడి గుండం ద్వారా నీళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయో మాత్రం ఎవరికి తెలియదు. ఇప్పటి వరకు ప్రపంచ శాస్త్రవేత్తలు కూడా ఈ తీర్థంలోని నీళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయో కనిపెట్టలేకపోయారు. కానీ అలా సుడి గుండం ద్వారా వెళ్తున్న నీరు చాలా లోతు వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి నంది నోటి నుండి వస్తాయని మన భారతీయ వేద శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

ఇలాంటి పంపింగ్ పద్దతిని మన వేద జ్ఞానాన్ని ఉపయోగించి మన పూర్వ భారతీయ ఇంజనీర్ లు , శాస్త్రవేత్తలు నిర్మించారని చెప్తున్నారు. ఎందుకంటే కల్యాణి తీర్థంలో నీరు ఎప్పుడు నిండటం లేదు అలాగే తగ్గటం కూడా లేదు మరియు నంది నోటి నుండి నిరంతరం నీరు వస్తూనే ఉంది కానీ ఆగడం లేదు. ఇలా మోటార్ లేకుండా ప్రపంచంలో మొట్ట మొదటి పంపింగ్ సిస్టమ్ ని తయారు చేసింది మన పూర్వ భారతీయ ఇంజనీర్ లు, శాస్త్రవేత్తలే. ఇక్కడ నంది ఏ శివ క్షేత్రంలో లేని విధంగా దక్షిణ వైపుగా ముఖం పెట్టి ఉంటుంది. ఇది ప్రత్యేకం. ఇక్కడ కల్యాణి తీర్థంలో తాబేళ్ళు, చేపలు ఉంటాయి.

ఈ క్షేత్రం యొక్క అద్భుతం గురించి Indian Express వెబ్ సైట్ లో కూడా పొందుపరిచారు. ఈ తీర్థ క్షేత్రం యొక్క చరిత్ర గురించి ఎవరికి తెలియదు. కానీ archeological survey of india వాళ్ళు కార్బన్ డేటింగ్ పద్ధతిలో ఈ గుడికి 400 ఏళ్ళు వయసు ఉండచ్చని చెప్తున్నారు. కానీ మన వేద శాస్త్రవేత్తలు ఈ క్షేత్రము 8,000 ఏళ్ళ క్రితం నాటిది అని చెప్తున్నారు. ఒకవేళ archelogical డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినట్టుగా ఈ క్షేత్రానికి 400 ఏళ్ళు ఉన్న కూడా అప్పటికి ఇంకా మోటార్ గాని, పంపింగ్ సిస్టమ్ గాని ఎవరు కనిపెట్టలేదు. ప్రపంచంలో మొట్ట మొదట పంపింగ్ సిస్టమ్ కనిపెట్టింది భారతీయులే. తప్పకుండా ఆర్టికల్ షేర్ చేయగలరు.

Watch and Share It:-

 

 

 

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.