Saturday , December 14 2019
Home / Devotional / Contract Employee insults devotee in Temple

Contract Employee insults devotee in Temple

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ చేస్తుంది. జొన్నవాడ కామాక్షమ్మ అమ్మవారి దేవాలయంలో మద్యం మత్తులో కాంట్రాక్ట్ ఉద్యోగి కార్తిక దీపాలు ఆర్పేసాడు. అలాగే తాగి ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగి భక్తులతో దురుసుగా మాట్లాడాడు. ఈ విషయంపై వెంటనే స్పందించిన MLA ప్రసన్న కుమార్ రెడ్డి వెంటనే స్పందించి కాంట్రాక్ట్ ఉద్యోగం తిసేసాడు. కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో మహిళలు కార్తీక దీపాలు వెలిగించడం ఆనవాయితీ. అందులోనూ కార్తీక సోమవారం అత్యంత పవిత్రంగా మహిళలు ఉపవాసం ఉండి సాయంత్రం దీపాలు వెలిగిస్తూ ఉంటారు.

అయితే అమ్మ వారి ఆలయంలో పనిచేసే శేషురెడ్డి అనే కాంట్రాక్ట్ ఉద్యోగి మహిళలు దీపాలు వెలిగిస్తుండగా మరోవైపు పైపు పెట్టి నీళ్లు పోసి దీపాలు ఆర్పేశాడు. దీనితో ఆగ్రహం చెందిన అమ్మ వారి భక్తులు ప్రశించగా ఇష్టం వచినట్టు కాంట్రాక్ట్ ఉద్యోగి మాట్లాడాడు. ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి అని బెదిరించాడు. ఈ వీడియో ని తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో చాలా మంది స్పందించారు. ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మంగళవారం ఉదయాన్నే ఆలయానికి చేరుకున్నారు. ఈవో కృష్ణారెడ్డిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయాలని రోజు రోజుకి భ్రష్టు పట్టిస్తున్నారని ప్రసన్న కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాంట్రాక్ట్ ఉద్యోగిని వెంటనే విధుల నుండి తప్పిస్తున్నట్టు తెలియజేసారు.

Watch and Share It:-

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

డైపరుద్దీన్ 15నిమిషాల ఏం పీకలేవు-రాజా సింగ్

Share this on WhatsApp కరీంనగర్ సభలో అక్బరుద్దీన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయం …