Monday , August 26 2019
Home / National / భారత IAF ని అవమానిస్తున్న దిగ్విజయ్ సింగ్

భారత IAF ని అవమానిస్తున్న దిగ్విజయ్ సింగ్

పుల్వామాలో 40 మంది CRPF జవాన్ల పై జరిగిన దాడిని ‘‘ఆక్సిడెంట్’’  మాత్రమే అని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.  మన భారత వైమానిక దళం (IAF ) చేసిన సర్జికల్ దాడులపై అనుమానాలు ఉన్నాయంటూ దేశ ద్రోహ వ్యాఖ్యలకి తెరతీస్తూ పాకిస్థాన్ కి మద్దత్తు తెలుపుతున్నాడు.   IAF చేసిన వైమానిక దాడులపై మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ దేశ ప్రజల మనోభావాలని దెబ్బతీసున్నాడు. భారత్ వైమానిక దళం చేసిన సర్జికల్ దాడులపై విదేశీ మీడియాలో సందేహాలు వ్యక్తం చేస్తున్నారని దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నాడు. అయిన మన జవాన్లు చేసిన దాడులని మనమే నమ్మకపోతే ప్రపంచంలో ఎవరు నమ్ముతారు. ఇది రాజకీయ దిగజారుడుతనమే.

పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ శిబిరాలపై నిజంగా దాడి జరిగితే ఆధారాలు చూపించాలని దిగ్విజయ్ సింగ్ అన్నాడు. ఇలాంటి పనికిమాలిన మాటలే మమతా బెనర్జీ, రాహుల్ గాంధీ, మెహబూబా ముఫ్తీ , కపిల్ సిబల్ కూడా చేస్తూ మన భారత వైమానిక దళాన్ని అవమానిస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు పాకిస్టాన్ కి మద్దత్తు చేసేలా ఉన్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ మీడియాలో చాలా వరకు fake news వైరల్ చేస్తూ భారత్ ని అవమానిస్తున్నారు. ఇలా పాకిస్థాన్ కి మద్దత్తు చేసే విధంగా జవాన్లు చేసిన వీరోచిత పోరాటాలపైన రాజకీయాలు చేస్తూ అనుమానాలు వ్యక్తం చేయడం దిగజారుడు తనమే అని చెప్పుకోవాలి. అయితే దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కపిల్ సిబల్ కాంగ్రెస్ నేత ఎంత మంది ఉగ్రవాదులు చచ్చారో చూపించాలని అడుగుతున్నాడు.

నిన్న భారత వైమానిక దళం IAF చీఫ్ గారు మాట్లాడుతూ “భారత్ వైమానిక దళం టార్గెట్ లని పేల్చడం వరకే మా బాధ్యత, లక్ష్యాలని చెందించడం వరకు మాత్రమే మా బాధ్యత అని , ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేయడం వరకే మా బాధ్యత అని, ఆ దాడుల్లో ఎంత మంది ఉగ్రవాదులు చనిపోయారు అనేది లెక్కించడం మా బాధ్యత కాదని చెప్పారు. అయితే 300 మంది ఉగ్రవాదులు దాడి జరుగుతున్న సమయంలో తమ ఫోన్స్ ఆక్టివ్ లో ఉండి కాల్స్ బిజీగా నడిచాయని NTRO (నేషనల్ టెక్నికల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ) వాళ్ళు ఆధారాలు చూపిస్తున్నారు. బలకోట్ లో జరిగిన వైమానిక దాడికి సంబంధించి ఇప్పటికే IAF అధికారులు pak ఎఫ్-16 తుక్కు తుక్కు అయి పడిపోయిన ఆధారాలు చూపిస్తున్నారు. కానీ మన భారత వైమానిక దళాన్నే అవమానిస్తూ దిగ్విజయ్ అనుమానాలు వ్యక్తం చేయడం దారుణం, రాజకీయాల కోసం కొంత మంది నేతలు దేశ పరువుని తీస్తున్నారు.

 

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

అక్బరుద్దీన్ కి వార్నింగ్ ఇచ్చిన రాజాసింగ్

Share this on WhatsApp మొన్న హైదరాబాద్ లో అక్బరుద్దీన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో అందరూ మండిపడుతున్నారు. …