Friday , August 23 2019
Home / National / బిడ్డ ప్రాణాలు గాల్లో కలిపేసిన పాస్టర్లు

బిడ్డ ప్రాణాలు గాల్లో కలిపేసిన పాస్టర్లు

క్రైస్తవంలో స్వస్థత పేరుతో జరుగుతున్నా మూఢ నమ్మకాల వల్ల ఒక బిడ్డ ప్రాణం పోయింది. అసలు సమాజం ఎటు పోతుంది, ఇంకా ఎంత మంది అమాయకులు ఇలా బలవ్వాలి. మూఢ నమ్మకాలని ప్రేరేపిస్తూ సమాజాన్ని గతి తప్పిస్తున్న వీరి ఆగడాలని ప్రశ్నించే వారే లేరా? అయితే ప్రస్తుతం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం సోమగుడెం కల్వరి చర్చ్ లో ఒక అమాయకుడి ప్రాణాలు పోయాయి. ఓ తల్లి తన బిడ్డకి జ్వరం రావడంతో పాస్టర్ మాటలు నమ్మి చర్చికి వెళ్ళింది. ఆ చర్చ్ లో మృతుడి తల్లికి మొబైల్ లో ఇంతకు ముందు వ్యాధులు తగ్గించినట్టుగా fake created videos చూపించారు. మృతుడి తల్లి ఆ వీడియోలు చూసి నిజమని నమ్మింది. మృతుడి తల్లి మాట్లాడుతూ “15 సంవత్సరాల నుండి రోగాలతో బాధపడుతున్న వాళ్ళకి కూడా పాస్టర్ చేతు పెట్టి ప్రార్థన చేస్తే తగ్గుతుందని నమ్మించారని” చెప్పింది. చర్చ్ కి పదివేలు రూపాయలతో వెళ్ళమని మృతుడి తల్లి చెప్తుంది. మొత్తం డబ్బులు కొత్త చర్చ్ నిర్మాణానికి అవసరమని పాస్టర్ అడిగి తీసుకున్నాడని చెప్పింది. చర్చ్ కి గురు వారం నాడు వెళ్ళమని, అప్పటి నుండి ఒక్కరోజు కూడా తమని పట్టించుకోలేదని ఆ తల్లి ఆవేదనతో అన్నారు. తన కొడుకు తలపై చెయ్యి పెట్టి ప్రార్థన చేయమని అందరినీ వెడుకున్నానని, కానీ ఎవరు పట్టించుకోలేదని అన్నారు. చివరికి స్టేజ్ పైకి ఎక్కి తన కొడుకు చావు బతుకుల మధ్య ఉన్నాడని చెప్పాలనుకుంటే, స్టేజ్ దిగమని అరిచారని చెప్తుంది. చివరికి తన కొడుకు ప్రాణాలు పోయే ముందు ట్రాలి బండి లో ఎక్కించారని, ఆ సమయంలో తన కొడుకు కళ్ళు మూస్తూ తెరిచాడని చెప్పింది. అప్పటికే ఆ తల్లి బండి డ్రైవరుతో హాస్పిటల్ కి తీసుకెళ్ళమని చెప్పానని అంటుంది. తల్లి మాట్లాడుతూ “ఎంత ఖర్చు అయినా పర్లేదు వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లమన్నట్లు” చెప్పానని, కానీ బండి డ్రైవరు ఆపకుండా అటు ఇటు తిప్పుతున్నాడని అన్నారు. ఇంకా మృతుడి తల్లి ఆవేదనతో మాట్లాడుతూ ” ఇలా ఎంత మంది తల్లుల ఉసురు తీస్తున్నారో ఈ పాస్టర్లు అని, ఏ రైల్ కింద తన బిడ్డ శవాన్ని పారవేసేవారోనని అన్నారు. తమ దగ్గర కనీసం మొబైల్ కూడా లేదని, మొగ దిక్కు కూడా లేడని, తమని ఏం చేశావరో రాత్రి అని భయంతో చెప్పింది. మృతుడి తల్లి డ్రైవరు కాళ్ళు మొక్కుతాము వేడుకున్నా ఆపలేదని, ట్రాలి బండి ఆపకపోతే బయటకి దూకుతామని చెప్పినా కూడా ఆపలేదని, ఇంకా డ్రైవర్ దూకమని తిరిగి సమాధానం ఇస్తూ బెదిరించాడని చెప్పింది. ఇక వెంటనే కాపాడండి కాపాడండి అంటూ మృతుడి తల్లి మరియు ఆమె అడుబిడ్డ అరిచారు.

ట్రాలి బండి వెళ్తున్న క్రమంలో అక్కడ బ్రిడ్జ్ దగ్గర ఒక ఇద్దరు ప్రయాణికులు ఆగి ఉన్నారు. వాళ్ళకి “కాపాడండి కాపాడండి” అనే అరుపులు వినిపించాయి. అవి విన్న ప్రయాణీకులు వీళ్ళ ట్రాలీ బండిని చేస్ చేసి సైడ్  కొట్టారు. అలా సైడ్ కొట్టడంతో వెంటనే ట్రాలి బండిని డ్రైవరు బెల్లంపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకెళ్లాడు. నిజానికి బెల్లంపల్లి చర్చ్ నుండి 3 గంటలు ట్రాలి బండిలో తిప్పారని కాపాడిన ప్రయాణికులు అన్నారు. కాపాడిన వ్యక్తులు మాట్లాడుతూ “మృతుడి తల్లి కాపాడండి కాపాడండి అని అరిస్తే వెళ్ళి కాపాడమని, అలాగే తర్వాత SI గారికి కాంప్లెంట్ ఇచ్చామని చెప్పారు.  మృతుడి పేరు రాజేష్ , మృతుడి వయసు 21 సంవత్సరాలు.

Watch and Share It:- 

Watch It Part-2:

Watch and Share It Part-3:

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

అక్బరుద్దీన్ కి వార్నింగ్ ఇచ్చిన రాజాసింగ్

Share this on WhatsApp మొన్న హైదరాబాద్ లో అక్బరుద్దీన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో అందరూ మండిపడుతున్నారు. …