Tuesday , July 23 2019
Home / National / కేరళలో బుర్కా నిషేధం -దేశ వ్యాప్తంగా సంచలనం

కేరళలో బుర్కా నిషేధం -దేశ వ్యాప్తంగా సంచలనం

ముందుగా ఈ విషయం మాట్లాడుకోవాలి. శ్రీలంకలో జరిగిన పేలుళ్ళ తర్వాత ప్రధాని మైత్రి పాల సిరిసేన బుర్కా లని నిషేదిస్తూ చట్టం చేశారు. అదే విధంగా శ్రీలంక ప్రభుత్వం వెంటనే బుర్కా ని నిషేదిస్తూ అక్కడి పార్లమెంట్ లో కొత్త చట్టాన్ని ఆమోదించింది. అదే విధంగా మహారాష్ట్ర శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే బుర్కా ని భారత్ లో నిషేదించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. అసదుద్దీన్ ఓవైసీ తిరిగి ఉద్ధవ్ థాక్రే వ్యాఖ్యలని ఖండిస్తూ పరదాలని కూడా నిషేదించాలని విమర్శించారు.

అయితే ప్రస్తుతం కేరళలోని మాలాప్పురమ్  జిల్లాలో ముస్లిం ఎడ్యుకేషనల్ సొసైటి ఇంజనీరింగ్ , మెడికల్ institutions మరియు కాలేజీలలో బుర్కా ని నిషేదించారు. చిన్న గుడ్డ ముక్క కూడా కట్టుకోవద్దని కేరళలో ఉన్న మలప్పురమ్ జిల్లా కాలేజీలలో రూల్ తీసుకువచ్చారు. ఈ రూల్ ని కోర్ట్ తీర్పు ద్వారా తెచ్చుకున్నారు. సమాజంలో మంచి మార్పుని కోరుకునేందుకే ఈ చర్యని పేర్కొన్నారు. కొంత మంది దీన్ని వ్యతిరేకించే మత వాదులు కూడా ఉన్నారు. కేరళలో మెజారిటీ స్థాయిలో ఇస్లాం ఉంది. ఈ అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో అయితే రచ్చ రచ్చ చేస్తుంది. దీన్ని మత విశ్వాసంగా భావించే వాళ్ళు కొందరు అయితే , బుర్కా వల్ల ఆడవారికి స్వేచ్ఛ లేకపోవడం ఒక కారణమైతే , అలాగే ఉగ్రవాదులని గుర్తించలేమని దేశానికి ముప్పు అని వాదించే వాళ్ళు ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకి ఉగ్రవాదం పెరుగుతుంది. శ్రీలంక పేలుళ్ళలో 250 కి పైగా చనిపోయారు. శ్రీలంక ప్రధాని మైత్రిపాల సిరిసేన ఉగ్రవాదాన్ని అణచివేసే దిశగా బుర్కాని నిషేదిస్తున్నట్లు వ్యాఖ్యానించారు.

Watch and Share It:-

 

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

దేశంలోనే No.1 అప్పుల రాష్ట్రం షేర్ చేయండి

Share this on WhatsApp తెలంగాణ ప్రజలకి దిమ్మ తిరిగేలా నిజాలు బయటపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్. …