Tuesday , June 18 2019
Home / National / కిషన్ రెడ్డి పనికి అందరూ ఫీదా అవ్వాల్సిందే

కిషన్ రెడ్డి పనికి అందరూ ఫీదా అవ్వాల్సిందే

కిషన్ రెడ్డి చేసిన పనికి ఎవరైనా ఆయనకు ఫీదా అవ్వాలిసిందే. ఈయన బి‌జే‌పి లీడర్. బి‌జే‌పి అనగానే ముందుగా హిందుత్వ అజెండా ఉన్న పార్టీ గానే చూస్తారు కానీ ఈయన బి‌జే‌పి పార్టీని అభివృద్ధి కోసమే పుట్టిన పార్టీగా మార్చేశాడు. మూడు సార్లు MLA గెలిచాడు అంటే అర్థం చేసుకోండీ. చాలా సాధారణమైన వ్యక్తిలాగా గల్లీ లలో తిరుగుతూ ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు దృష్టి పెడతాడు. మొన్న జరిగిన లోక్ సభ ఎన్నికలలో MP పోటీ చేసి గెలిచాడు. ఈయనకు ముస్లింలలో విపరీతమైన అభిమానులు ఉన్నారంటే కిషన్ రెడ్డి వ్యక్తిత్వం మీరు అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడు అభివృద్ధి కోసమే కృషి చేస్తాడు. ఈయన ఒక ప్రభుత్వ స్కూల్ చాలా అభివృద్ధి చేశాడు. అందులో applications కోసం ప్రతి సంవత్సరం విధ్యార్థులు క్యూలు కడతారు. applications అయిపోతే వెనుదిరిగి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ ప్రభుత్వ స్కూల్ కి కిషన్  రెడ్డి స్కూల్ అని పిలుస్తారంటే మీరే అర్థం చేసుకోండీ ఎంతగా అభివృద్ధి చేశారో, తను ఎన్నికైన ప్రాంతాన్ని చాలా అభివృద్ధి చేశాడు. ఏ రోజు ఏ పని చేశారో ఒక బుక్ పెట్టి 365 రోజుల గడిచాక ప్రింట్ చేయిస్తారు.

అయితే ప్రస్తుతం కిషన్ రెడ్డి సికింద్రాబాద్ లోక్ సభ ఎన్నికలలో గెలిచిన సందర్భంగా తన అభిమానులకు, కార్యకర్తలకు, బంధువులకి, సన్నిహితులకి, శ్రేయోభిలాషులకి ముందుగానే ఇలా సూచించాడు. ఎవరైనా తనకి అభినందనలు తెలుపడానికి రావాలనుకుంటే పుష్ప గుచ్చాలు గాని, పూల దండలు గాని, శాలువాలు గాని తీసుకు రావద్దని చెప్పాడు. ఇలా చేయడం వల్ల డబ్బు వృధా అవుతుందని, వాటికి బదులు ప్రభుత్వ పాఠశాలలోని విధ్యార్థులకు నోట్ బుక్స్ తీసుకురావాలని సూచించారు. ఆయన కోరిన విధంగానే వెంటనే వేల నోట్ బుక్స్ తీసుకొని వచ్చారు. దాదాపుగా 8,000 పైన బుక్స్ అందాయట. నిజంగా ఇంత మంచి నాయకుడు తెలుగు ప్రజలకి దొరకడం అదృష్టం. గొప్ప మనసున్న నాయకులు ఈ కాలంలో చాలా తక్కువ. అందులో బంగారం కిషన్ రెడ్డి. ఈ చివరి మాట ఎందుకు అంటున్నానంటే కిషన్ రెడ్డి MLA ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నప్పుడు ఒక ముస్లిం తన ఇళ్ళు అమ్మైనా సరే కిషన్ రెడ్డికి ఇచ్చేస్తానని అన్నాడు. అంతా గొప్ప వ్యక్తిత్వం కిషన్ రెడ్డిది.

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

బి‌జే‌పి MLA రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు

Share this on WhatsApp యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉండి ఎక్కువగా ప్రజల గుండెల్లో ఉన్న వాదనలని మరియు …