Sunday , September 15 2019
Home / Politics / KCR పై తీవ్రస్థాయిలో మండిపడ్డ MP బండి సంజయ్

KCR పై తీవ్రస్థాయిలో మండిపడ్డ MP బండి సంజయ్

తెలంగాణలో బండి సంజయ్ అంటే తెలియని వాళ్ళు ఉండరు, ఈయన యూత్ లో పిచ్చి క్రేజ్. డబ్బులు లేకపోయిన ఈయన వెనుక వేల మంది యువకులు వెన్నంటే ఉండి ఎంపి అభ్యర్థిగా గెలిపించుకున్నారు.  అయితే లోక్ సభలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ తీవ్ర స్థాయిలో కెసిఆర్ పై మండి పడ్డారు. బండి సంజయ్ మాట్లాడుతూ” కేసీఆర్ నీరో చక్రవర్తిలా పాలన కొనసాగిస్తున్నారని” మండిపడ్డారు. కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే తెలంగాణ రాష్ట్రంలో 27 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. ఇంటర్మీడియట్ ఫలితాలపై  జరిగిన అవకతవకలలో ఇప్పటివరకు టిఆర్ఎస్  ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని, కనీసం వివరణ కూడా ఇవ్వలేదని గట్టిగా విమర్శించారు.

కెసిఆర్ చదువుని వ్యాపారం లాగే చూస్తున్నాడని మండిపడ్డారు. అసలు ఎలాంటి అనుభవం లేని గ్లోబరీనా సంస్థకు ఇంటర్మీడియట్ ఫలితాల  బాధ్యతను అప్పగించి ఇంటర్ విద్యార్థుల చావులకు కెసిఆర్ కారణం అయ్యారని చెప్పారు. ఇంటర్  ఫలితాలలో జరిగిన అవకతవకలపై ముగ్గురు సభ్యుల కమిటీ నివేదిక ఇచ్చామని బండి సంజయ్ చెప్పారు. నివేదిక ఇచ్చిన కూడా ఇంతవరకు చర్యలు తీసుకోలేదని బండి సంజయ్ తెలిపారు.  గవర్నర్ నరసింహన్ ఆగ్రహం వ్యక్తం చేసినా కూడా ముఖ్యమంత్రి కెసిఆర్ నుండి ఎలాంటి స్పందనలేదని అన్నారు. చివరికి చనిపోయిన ఇంటర్ విద్యార్థుల కుటుంబాలని కూడా పరామర్శించలేదని అన్నారు. తెలంగాణ వ్యతిరేకి నామ నాగేశ్వర్ ని అడ్డం పెట్టుకొని ఇంటర్ విద్యార్థుల కి జరిగిన అన్యాయాన్ని కూడా బయటకు చెప్పన్నివ్వడం లేదని నిజామాబాద్ ఎంపి అరవింద్ మండిపడ్డారు.

Watch and Share It:-

 

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

TRS మైత్రి వల్లే అక్బరుద్దీన్ పై కేసు లేదు

Share this on WhatsApp మొన్న కరీంనగర్ లో జరిగిన సభలో ఒవైసీ హిందువులని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసాడు. …