Wednesday , November 13 2019
Home / National / తెలుగు సినిమాల వల్ల బ్రెయిన్ పెరగదు-బాల లత

తెలుగు సినిమాల వల్ల బ్రెయిన్ పెరగదు-బాల లత

2009 లో ఇండియన్ డిఫెన్స్ సర్వీస్ లో 399 రాంక్ సాధించిన బాల లతని అంజలి గారు ఇంటర్వ్యూ చేసారు. 2016 లో ఈమె సివిల్ సర్వీసెస్ లో 167 రాంక్ సాధించారు. ఈమె సివిల్ సర్వీసెస్ చేసే వాళ్ళకి కోచింగ్ కూడా ఇస్తారు. బాల లత గారు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “తెలుగు సినిమాలు చూడటం వల్ల ప్రయోజనం ఉండదని” అన్నారు. 99 శాతం తెలుగు సినిమాలు చూస్తే బ్రెయిన్ పెరగదని చెప్పారు. పోకిరి, ఆవారా,జులాయి, జల్సా ఇలాంటి సినిమాలు లవ్ ని , రోమాన్స్ ని ఎంకరేజ్ చేస్తూ యువతని చెడగోట్టేవి. సినిమా అంటే రొటీన్ లవ్ స్టొరీ అయిపోయిందని, యువతలో క్రియేటివిటిని తెచ్చేవిగా ఉండటం లేదని అన్నారు. హాలివుడ్ లో చుస్తే గ్రావిటీ, మర్షన్ చుస్తే జీవితంలో ఏదైనా ఆలోచనలు పుడతాయని అన్నారు. సినిమాలకి కూడా బాధ్యత ఉంటుంది అని అన్నారు.

యువతలో హార్మోన్స్ ని రెచ్చగొట్టే విధంగా ఇప్పటి సినిమాలు ఉంటున్నాయని అన్నారు. ప్రస్తుతం వస్తున్నా బయోపిక్ లలో కూడా నిజాయితీ పోయిందని అన్నారు. ముందుగా ఎన్టీఆర్ పై వచ్చిన బయోపిక్ లలో నిజం చూపించలేదని, లక్ష్మీస్ ఎన్టీఆర్ లో కూడా ఒక వైపు కోణం నుండి మాత్రమే చూపించారని అన్నారు. ప్రతి ఒక్క వ్యక్తిలో weakness ఉంటుందని, దాన్ని చూపించకుండా , అసలు పాత్రని పొగిడేలా సినిమా చూపిస్తున్నారని అన్నారు. దీని వల్ల జనాలు నేర్చుకోనేది ఏమి ఉండదని అన్నారు.

Watch and Share It:-

 

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

TRS మైత్రి వల్లే అక్బరుద్దీన్ పై కేసు లేదు

Share this on WhatsApp మొన్న కరీంనగర్ లో జరిగిన సభలో ఒవైసీ హిందువులని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసాడు. …