Tuesday , May 21 2019
Home / Politics / హిందువులపై అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు

హిందువులపై అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు

కమలహాసన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడు జిల్లా కరూర్ దగ్గర అరవకురిచ్చిలో చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా పెద్ద దుమారాన్నే రేపాయి. ముఖ్యంగా కమలహాసన్ ముస్లిం ఓట్ల కోసం నీచ రాజకీయాలు దిగాడని బి‌జే‌పి నేతలు తీవ్ర స్థాయిలో విమర్శించారు. .తమిళనాడు మంత్రి కే‌టి రాజేంద్ర బాలాజీ అయితే ఏకంగా “కమలహాసన్ నాలుక తెగ్గొయండి” అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ముస్లిం ఓట్ల కోసం “మొదటి ఉగ్రవాది హిందువేనని మాట్లాడటం కరెక్ట్ కాదని అన్నారు. ఇంకా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కూడా కమలహాసన్ చెంప పగిలే పోయే సమాధానం ట్విటర్ లో ఇచ్చాడు. ఒబెరాయ్ చేసిన ట్వీట్ సారాంశం ఏంటంటే “కమలహాసన్ ని ఉద్దేశించి “ఉగ్రవాదానికి మతం లేదని అంటున్నావు దేశంలో మొదటి ఉగ్రవాది హిందువేనని ఎలా అంటున్నావని ప్రశ్నించాడు. ఉగ్రవాదానికి మతం లేదని అన్నప్పుడు మళ్ళీ హిందూ ఉగ్రవాదం అనడంలో అర్థం లేదని అన్నాడు.

అయితే కమలహాసన్ చేసిన వ్యాఖ్యలకు మద్దత్తుగా ఓవైసి నిలుస్తున్నట్లు మీడియా ముందు చెప్పాడు. అసదుద్దీన్ మాట్లాడుతూ “దేశానికి జాతి పిత గాంధీ అయినప్పుడు గాంధీని గన్ తో కాల్చి చంపినవాడు ఉగ్రవాది కాకా ఏం అవుతాడని ప్రశ్నించాడు. నాథూ రామ్ గాడ్సే ఉగ్రవాది కాకా గొప్పవాడు అవుతాడా అని అన్నాడు. కమల హాసన్ చేసిన వ్యాఖ్యలకు అండగా ఉంటానని అన్నాడు. దేశంలో తొలి ఉగ్రవాది హిందువేనని అన్నాడు. అయినా 15 నిమిషాలలో భారతదేశంలోని హిందువులని చంపుతాను అని మాట్లాడినా తమ్ముడిని వ్యతిరేకించలేని వాడు, ఇలాంటి విషయంలో కమల హాసన్ ని ఎందుకు వ్యతిరేకిస్తాడు. ప్రస్తుతం కమలహాసన్ పై ఢీల్లి కోర్ట్ లో క్రిమినల్ కేసు కూడా నమోదు అయ్యింది. తమిళనాడు పోలీసులు కూడా కమల హాసన్ పై fir నమోదు చేశారు.

Watch and Share It:-

 

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

అసలు దయ్యాలు ఉన్నాయా ? – గరికపాటి అభిప్రాయం

Share this on WhatsApp మన తెలుగు రాష్ట్రాల్లో అద్బుతమైన ప్రవచన కర్తలలో గరికపాటి నరసింహరావు గారు ఒకరు. నరసింహరావు …