Wednesday , April 24 2019
Home / National / జైష్ ఏ మహమ్మద్ రాక్షసుడు కుక్క-అసదుద్దీన్

జైష్ ఏ మహమ్మద్ రాక్షసుడు కుక్క-అసదుద్దీన్

అసదుద్దీన్ ఒక సభలో మాట్లాడుతూ “IAF అభినందన్ గారు భారత్ రావడం పై హర్షం వ్యక్తం చేశారు. అలాగే హిందూస్థాన్ కి శత్రువులు ఎవరైతే వాళ్ళు మాకు కూడా శత్రువులు, హిందూస్థాన్ ని నాశనం చేయాలి అనుకునే వారు ఎవరైనా మాకు శత్రువులే. ఇదే విషయాన్ని ముంబై లోని సభలో కూడా చెప్పానని చెప్పారు. దేశం విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదని, చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఇంకా అసదుద్దీన్ మాట్లాడుతూ “పాకిస్థాన్ 40 మందిని జవాన్లని చంపిందని, హిందూస్థాన్ ఎయిర్ ఫోర్స్ దీనికి బదులుగా మసూద్ అజర్ , జైష్ ఏ మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై Spice-2000 బాంబ్ లు వేశారని అన్నారు. ఇది జరగడానికి 12 రోజులు ఎందుకు పట్టింది అని ప్రశ్నించాడు. టి‌వి స్టూడియోలో కొంత మంది కుర్చీల్లో కూర్చొని మాట్లాడుతూ రాజకీయం చేస్తున్నారని, వాళ్ళు బార్డర్ లోకి వెళితే తెలుస్తుందని చెప్పారు.

అసదుద్దీన్ మాట్లాడుతూ “పాకిస్థాన్ లో ఉన్న ఉగ్రవాది మసూద్ అజర్ ని జైల్లో పెట్టాలని, అతను జైష్ ఏ మహమ్మద్ కాదు నరరూప రాక్షసుడు, ఐసిస్ కుక్క , అతను మౌలానా కాదు సైతాన్ భూతం, అతను హఫీజ్ కాదు వాడు దొంగ. వీళ్ళు పాటిస్తున్నది ఇస్లాం” కాదని అన్నాడు. ఇలా బాంబ్ లు వేయడం, సూసైడ్ బాంబర్ లు గా మారడం ఇస్లాం తత్వం కాదని అన్నారు. ఇస్లాం పేరుని చెడగొడుతున్నారని అన్నాడు. 26/11 లో ముంబై లోని హోటల్ పై , VT స్టేషన్ లో బాంబ్ లు వేయడం ఇస్లాం కాదని, ఇస్లాం పేరు చెడగొడుతున్నారని అన్నారు. మంచి పనులు చేయడమే ఇస్లాం తత్వమని చెప్పారు. మీడియాలో విదేశాంగ మంత్రి కూర్చొని మసూద్ దేశానికి పట్టిన రోగం అని అంటున్నారు, రోగానికి చావు లేదా అని అన్నారు. పాకిస్థాన్ మసూద్ అజర్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, భారత్ ఆధారాలు ఇచ్చిన తర్వాత మరియు ఉగ్రవాద సంస్థ అని తెలిసిన తర్వాత కూడా ఇంకా ఆధారాలు కావాలి అంటారు. వెంటనే పాకిస్థాన్ చర్యలు ఉగ్రవాదులపై తీసుకోవాలని చెప్పారు.

అసదుద్దీన్ మాట్లాడుతూ “పుల్వామా దాడి ఇంటెలిజన్స్ ఫైల్యూర్ అని, దీనిపై చర్యలు ఏం తీసుకున్నారని, సూసైడ్ బాంబర్ DNA సంగతి ఏంటి అని అన్నాడు. అలాగే టిప్పు సుల్తాన్ , రహ్మ తుల్లా హిందువులకి వ్యతిరేకం కాదని, చరిత్ర చదవండి అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఇంకా ఆవు మాంసం పేరుతో ముస్లింలని, దళితులని హింసిస్తున్నారని అన్నాడు.

 Watch and Share It:-

 

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

ఇవి తింటే మీ పిల్లలు త్వరగా చస్తారు-చూడండి

Share this on WhatsApp పిల్లలే ప్రాణం అని బతికే భారతీయులం మనం. మన పిల్లలకి చిన్న దెబ్బ తగిలితేనే …