Sunday , February 24 2019
Home / Ancient Indian Science&Tech / పూర్వ కాలంలో Advanced Machine Technology

పూర్వ కాలంలో Advanced Machine Technology

నిజంగా పూర్వకాలంలో మన దేవాలయాలు machines తో నిర్మించారనే చాలా మంది శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎందుకంటే అన్ని వందల, వేల టన్నుల రాళ్లతో అన్ని రకాల రూపాల్లో చెక్కడం,  అంతా ఖచ్చితమైన కొలతలతో చెక్కడం, మామూలుగా చెక్కడం అసాధ్యం. భారత్ దేశంలోని కైలాస నాథ్ దేవాలయం అయితే పూర్తిగా ఒక కొండని దేవాలయంగా చెక్కారు. మొత్తం 4 లక్షల టన్నుల రాతిని కొండ నుండి వేరు చేసి దేవాలయాన్ని నిర్మించారు. ఇంతా పెద్ద నిర్మాణాన్ని చాలా తక్కువ సమయంలో 18 సంవత్సరాలలో చెక్కారని archeology డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. కాని అలాంటి కొండ నుండి  ఇప్పటి వాళ్ళు ఎంత హై టెక్నాలజీ వాడిన నిర్మాణం చేయడానికి ఎక్కువ సంవత్సరాల కాలం పడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎందుకంటే 4 లక్షల టన్నుల రాతిని తీసేయడం అంటే మాములు విషయం కాదు. ఈ దేవాలయాన్ని ఔరంగజేబ్ కూలగొట్టడానికి తన పని వాళ్ళతో 3 సంవత్సరాల కంటే ఎక్కువ ప్రయత్నించాడు. కానీ ఆ దేవాలయాన్ని కొంత నాశనం చేసి దాన్ని ఇక పూర్తిగా ధ్వంసం చేయలేమని వదిలేశారు. అది మన భారతీయుల గొప్ప కట్టడం ప్రాముఖ్యత. ఇది మన పూర్వ భారతీయులు Advanced Machines వాడారనడానికి ఒక ఉదాహరణ.

అయితే “ప్రవీణ్ మోహన్” అనే archeology డిపార్ట్మెంట్ యువకుడు హంపి లో పూర్వ కాలంలో రాళ్లని కోసే యంత్రం వాడే వారని ఒక ఆధారాన్ని చూపిస్తున్నాడు. ఆ పరికరం ఇలా వాడే వారు అంటూ “ప్రయోగ పూర్వకంగా చూపించాడు.” ప్రవీణ్ మోహన్ చెప్పే విషయం ప్రకారం “హంపి లో ఉన్న రాళ్లని చెక్కే యంత్రంలో రెండు స్థంబాలు ఉన్నాయి. ఆ రెండు స్థంబాలకి పైన రెండు రంధ్రాలు ఉన్నాయి. అక్కడ కొంత దూరంలో పడేసిన యంత్రం యొక్క భాగంని దీని దగ్గలో చేర్చి ఇలా వాడుతారని visual గా చూపిస్తున్నాడు. అలాగే పైన ఆ రెండు స్థంబాలకి ఉన్న రంధ్రాల్లో ఒక machine ఉండేది అని అంటున్నారు. దానితో రాళ్లని ఒక తప్పిదం జరగకుండా అంతా పర్ఫెక్ట్ గా చెక్కరని చూపిస్తున్నాడు. ఆ వీడియో కింద ఇస్తున్నాం. చూడగలరు.

Watch and Share It :-

హంపిలో ఉన్న పూర్వ భారతీయ టెక్నాలజీ కీ సంబంధించిన కొన్ని నిర్మాణాలు:-

10 టన్నుల ముఖ ద్వారంని ఇంత ఖచ్చితంగా చెక్కగలిగారు అంటే అప్పటి కాలంలో ఒక గొప్ప టెక్నాలజీ వాడే ఉండాలి. ఇలాంటి ముఖ ద్వారాలు హంపిలో రెండు ఉన్నాయి.

ఈ 10 టన్నుల ముఖ ద్వారాలని దేవాలయాలకి గాని, కోటలకి గాని బిగించడానికి రంధ్రాలు కూడా ఉన్నాయి. ఆ రంధ్రాలు కూడా చాలా ఖచ్చితమైన కొలతలతో నిర్మించారు.

.

ఇది హంపిలోని దిగుడు బావి, దీనిని ఎంత అద్భుతంగా ఖచ్చితమైన కొలతలతో నిర్మించారో చూడండి. ఆ ఖచ్చితమైన కొలతలకి కారణం మెషిన్ లు వాడటమే కారణం.

.

మనం పుణ్య క్షేత్రాలకి గాని , పురాతన దేవాలయాలకి గాని వెళ్లినప్పుడు ఇలాంటి అద్బుతమైన నిర్మాణాలు చూస్తుంటాం. కానీ వారు మనకి అందించిన శ్రమని గుర్తించలేకపోతున్నాము. మన పురాతన దేవాలయాలని కాపాడుకోలేకపోతున్నాము. తిరిగి మన పురాతన దేవాలయాలని పునరుద్ధరించండి.

.

ఈ పొడవైన రాతి నిర్మాణం ఎందుకు చేశారో తెలియదు కానీ చాలా ఖచ్చితమైన కొలతలతో దీన్ని నిర్మించినట్టుగా తెలుస్తుంది. ఇలాంటి అద్బుతమైన నిర్మాణాలని వెలుగులోకి తీసుకొచ్చి భారతీయుల గొప్పతనం చాటండి.

.

కొన్ని వందల వేల దేవాలయాల గోపురాలపై ఇలాంటి అద్భుతమైన టెక్నాలజీ మనం చూస్తూనే ఉంటాము. నిజంగా అనేక రకాలైన ఆకారాల్లో అంతా ఖచ్చితంగా చెక్కరంటే యంత్రాలని ఉపయోగించి చేశారనే చెప్పచ్చు.

 

ఒక మన దేశంలో మాత్రమే కాదు. ప్రపంచంలో కొన్ని సంస్కృతులు విలసిల్లిన కాలంలో రాళ్ళన్ని చెక్కే టెక్నాలజీ ఉండేదని చెప్తున్నారు. ఈజిప్ట్ పిరమిడ్ లు కూడా ఒక ఉదాహరణ. వేల టన్నుల రాళ్లని ఎంత పర్ఫెక్ట్ గా చెక్కారో చూడండి. వీటిని బట్టి చూస్తే పూర్వ కాలంలో advanced machines వాడరని మనకు అర్థం అవుతుంది.

 

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

మీ జవాన్ల శవపేటికలు కొనసాగుతాయి – పాకి పంది

Share this on WhatsApp పుల్వామాలో జరిగిన దాడిలో 44 మంది జవాన్లు చనిపోయిన తర్వాత దేశంలో ఒక్కసారిగా విషాద …