Monday , July 22 2019
Home / Ayurveda / అమెరికా శాస్త్రవేత్తలు కనిపెట్టిన రహస్యం

అమెరికా శాస్త్రవేత్తలు కనిపెట్టిన రహస్యం

పూర్వకాలములో ఋషులు, మునులు, యోగులు మనకి ఎంతో అద్భుతమైన జ్ఞానసంపదని ఇచ్చారు. అందులో ఆయుర్వేదం ఒకటి. ఎన్నో రకాల రోగాలకి, అంతు చిక్కని వ్యాధులకి ఆయుర్వేదం ద్వారా నయం చేసే పద్ధతులని కనిపెట్టారు. కొన్ని ఆయుర్వేద మూలికాలని మన నిత్య జీవితంలో భాగం చేసారు. ఎలా అంటే ముఖ సౌందర్యానికి పచ్చిపసుపు, పాలు కలిపి పెట్టుకోవడం, దీని వల్ల ముఖంపై మచ్చలు,ముడతలు, నల్ల మరకలు పోతాయి. గాయాలు అయితే పసుపు వాడుతాము. దీని వల్ల ముందుగా రక్తం త్వరగా గడ్డకట్టి దెబ్బ త్వరగా మానుతుంది. ఇక తినే ఆహార పదార్థాలలో కూడా పసుపుని వేస్తారు. కొన్ని సమయాలలో తీవ్రమైన దగ్గు బాధతో గాని ఉంటే పసుపు చిన్న గుండ్రని గోలిలా ముద్ద చేసుకొని మింగాలి. దీని ద్వారా వెంటనే గొంతు సమస్యలు తగ్గుతాయి. ఆడవాళ్ళు కాళ్ళకి పసుపు కూడా ఆచారంగా రాసుకుంటారు. ఆయుర్వేదంలో చర్మ వ్యాధులకి పసుపు, వేపని కలిపి రాస్తారు.

అయితే పసుపు గురించి అమెరికా శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన విషయాన్ని కనిపెట్టారు. అది ఏంటంటే పసుపులో కర్క్ మిన్ అనే పదార్థం వల్ల రూపొందించబడిన కొత్త బట్వాడా వ్యవస్థ ఎముక క్యాన్సర్ ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. పసుపు వల్ల ఆరోగ్యకరమైన కణాల అభివృద్ధి జరిగి ఎముక క్యాన్సర్ తగ్గుతుంది. ఈ ప్రయోగంలో భారత దేశానికి చెందిన సుస్మిత బోస్, నవనీత సర్కార్ ఉన్నారు. ఈ ఎముక క్యాన్సర్ ఎక్కువగా చిన్నపిల్లలో వస్తుంది.  నిజానికి భారతదేశంలో పసుపుని మన నిత్య జీవితంలో ప్రతి రోజు వంటలో వాడుతాము. పసుపుని అనాదిగా వాడుతూ వస్తున్నాము. హిందూ ఆచారాల ప్రకారం పూజలలో వాడుతాము. ఆయుర్వేదంలో రోగాలకి వాడుతాము. మన పూర్వీకుల వేల ఏళ్ళ క్రితమే ఎన్నో ఆలోచించి మన జీవనంలో భాగం చేసారు. ఇప్పుడు మన భారతీయులకి మన పూర్వీకులు అందించిన జ్ఞానం అవసరం లేదు. అదే విషయాన్ని అమెరికా వాళ్ళో, ఇతర దేశస్థులో ప్రయోగాలు చేసి చూపిస్తే అప్పుడు నమ్ముతాము. మన వాళ్ళు వేప పుల్లతో బ్రష్ చేసే వారు. ఇప్పుడు అదే వేపతో పేస్టు చేసి ఇతర దేశాల కంపెనీలు మనం ప్రపంచానికి అందించిన జ్ఞానాన్ని మనకే నేర్పుతున్నారు.

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

దేశంలోనే No.1 అప్పుల రాష్ట్రం షేర్ చేయండి

Share this on WhatsApp తెలంగాణ ప్రజలకి దిమ్మ తిరిగేలా నిజాలు బయటపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్. …