Monday , August 26 2019
Home / National / బొందుకి చెంప పగిలిపోయే బండి సంజయ్ సమాధానం

బొందుకి చెంప పగిలిపోయే బండి సంజయ్ సమాధానం

కరీంనగర్ లో బండి సంజయ్ తన గెలుపుతో మీడియా ముందుకు  వచ్చారు. బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ “కే‌సి‌ఆర్ కరీంనగర్ ప్రజలని సెంటి మెంట్ పేరుతో మోసం చేస్తూ ప్రతి సారి ఓట్లు గెలుచుకుంటున్నారని, కానీ కరీంనగర్ ప్రజలకి ఏమి చేయట్లేదని అన్నారు. టి‌ఆర్‌ఎస్ ప్రభుత్వం అభివృద్ధి సరిగ్గా చేయట్లేదని, పథకాల పేరుతో మోసం చేస్తుందని అన్నారు. అలాగే కే‌సి‌ఆర్ 80 % ఉన్న హిందువులని  పట్టుకొని “హిందూ గాళ్ళు, బొందుగాళ్ళు” అని అవమానించారని బండి సంజయ్ తెలిపారు. ఇలా హిందూ ధర్మాన్ని కించ పరిచినందుకు LKG నుండి PG వరకు ప్రతి ఒక్కరూ టి‌ఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ బి‌జే‌పిని గెలిపించారని అన్నారు. హిందువులతో పెట్టుకుంటే ఇలాగే సమాధానం ఇస్తారని బొందుకి చెంప పగిలిపోయేలా బండి సంజయ్ జవాబు ఇచ్చారు. కే‌సి‌ఆర్ కేవలం మైనారిటీల ఓట్ల కోసమే రాజకీయం చేస్తున్నారని అన్నారు. mim పార్టీ వాళ్ళకి టి‌ఆర్‌ఎస్ పార్టీ కొమ్ముకాస్తుందని చెప్పారు. old city లో యువతని educate కానివ్వకుండా అసదుద్దీన్ చేస్తున్నారని, అలాంటి వాళ్ళతో టి‌ఆర్‌ఎస్ పొత్తు పెట్టుకొని దిగజారుడు రాజకీయాలు చేస్తోందని అన్నారు.

ఇంకా బండి సంజయ్ మాట్లాడుతూ “టి‌ఆర్‌ఎస్ ప్రభుత్వం కేంద్ర పథకాలని తమ పథకాలుగా పేరు మార్చి క్రెడిట్ కొట్టేస్తోందని అన్నారు. trs వాళ్ళు అహంకార పూరిత మాటలకి ప్రజలు చక్కటి సమాధానం ఇచ్చారని తెలిపారు. స్మార్ట్ సిటి అనేది బి‌జే‌పి వల్ల వచ్చిందని , టి‌ఆర్‌ఎస్ ప్రభుత్వం కనీసం మోడీ గారికి ఈ విషయంలో అభినందనలు తెలుపలేదని చెప్పారు. ఇప్పుడు ప్రజలు కరీంనగర్ లో బి‌జే‌పికి అవకాశం ఇచ్చినందుకు తప్పకుండా కేంద్రం నుండి ఇంకా మంచి సంక్షేమ పథకాలని తెస్తామని అన్నారు. ఇంకా బండి సంజయ్ మాట్లాడుతూ “నన్ను నమ్ముకున్న ప్రజలకి తప్పకుండా మంచి పాలన అందిస్తానని” తెలిపారు.

Watch and Share It:-

 

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

అక్బరుద్దీన్ కి వార్నింగ్ ఇచ్చిన రాజాసింగ్

Share this on WhatsApp మొన్న హైదరాబాద్ లో అక్బరుద్దీన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో అందరూ మండిపడుతున్నారు. …