Sunday , February 24 2019
Home / National / 2019 కేంద్ర బడ్జెట్ హైలెట్స్ -షేర్ చేయండి

2019 కేంద్ర బడ్జెట్ హైలెట్స్ -షేర్ చేయండి

ప్రస్తుతం బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు మాట్లాడుతూ ” ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద తక్కువ భూమి ఉన్న రైతులకి నేరుగా డబ్బులు బ్యాంక్ అక్కౌంట్ లోకి వచ్చేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ డబ్బులు మొత్తం సంవత్సరానికి 6 వేలు. ఈ పథకం 5 ఎకరాలలోపు భూమి ఉన్న పేద రైతులకి మాత్రమే వర్తిస్తుంది. ఈ డబ్బులు మూడు విడతల్లో అందుతాయి. ఈ పథకం కింద కేంద్రం  రైతులకి 75,000 కోట్లు అందించబోతున్నారు. 12 కోట్ల మంది రైతులకి లబ్ది చేకూరుతుందని అన్నారు. నాలుగున్నర ఏళ్లలో ప్రవేశ పెట్టిన పథకాలు చాలా ఉన్నాయి. ఇంకా కొత్తవి తీసుకువచ్చారు. సోషల్ మీడియాలో చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అందరికీ అర్థం అవ్వాలనే షార్ట్ గా వివరిస్తున్నాం. ముందుగా ప్రజలని ఆకర్షిస్తున్న కేంద్ర బడ్జెట్ పథకాలు:-

  • ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మన్ యోజన పథకం ద్వారా రైతులకి నేరుగా బ్యాంక్ అక్కౌంట్ లోకి 6 వేల రూపాయలు
  • 60 ఏళ్ళు నిండిన వారికి ప్రతి నెల 3,000 రూపాయల పింఛన్
  • ఆదాయపు పన్ను పరిమితి 5 లక్షల లోపు ( 5 లక్షల లోపు జీతం ఉన్న వారు income టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు)
  • ఉజ్వల యోజన పథకం కింద 6 కోట్ల మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇవ్వబడ్డాయి. ఇంకో 2 కోట్ల మంది పేద ప్రజలకి 2019 బడ్జెట్ ద్వారా ఇవ్వబోతున్నారు.
  • కోటి 53 లక్షల ఇల్లులు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన్ కింద నిర్మించబడ్డాయి.
  • ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన కింద 15.8 లక్షల గ్రామాలలో పక్కా రోడ్లతో అనుసంధానం జరిగింది.
  • 143 కోట్ల LED బల్బ్ ల పంపిణీ జరిగింది. దీంతో 50,000 కోట్ల రూపాయలు ఆదా అవుతున్నాయి.
  • మాతృత్వ యోజన పథకంతో మహిళ ఉద్యోగులకి 26 వారాల సెలవులు.
  • గోవులని రక్షించడానికి గోకుల్ మిషన్ ద్వారా 750 కోట్లు
  •  కార్మికులు కూలీలకు 6 లక్షల వరకు ప్రమాద భీమా
  • 10 లక్షల మందికి ఆయుష్మాన్ భారత్ కింద ఆరోగ్య సేవలు అందాయి. ఇంకా అందుతూనే ఉన్నాయి.
  • రక్షణ రంగానికి బడ్జెట్ 3 లక్షల కోట్ల కంటే ఎక్కువ
  • ఇండియన్ రైల్వేలకు 64,500 కోట్లు
  • ఇళ్ల కొనుగోలు దారులకి GST మినహాయింపు
  • ఉద్యోగులకి పదవి విరమణ నాటికి గ్రాట్యుటీ 10 లక్షల నుండి 30 లక్షల వరకు పెంపు.
  • పేదలకు తక్కువ ధరలో ఆహార ఉత్పత్తులు అందించే విషయంలో 1,70,000 కోట్లు కేంద్రం ఖర్చు చేసినట్టుగా ఆర్థిక శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు.

Watch and Share It:-

Watch and Share It:-

 

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

మీ జవాన్ల శవపేటికలు కొనసాగుతాయి – పాకి పంది

Share this on WhatsApp పుల్వామాలో జరిగిన దాడిలో 44 మంది జవాన్లు చనిపోయిన తర్వాత దేశంలో ఒక్కసారిగా విషాద …